చాలా మంది టెన్షన్స్ వల్ల, లేదా వేరే వ్యక్తిగత కారణాల వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి వాటికి గురవుతుంటారు. వాటి నుండి బయటికి రావడానికి కొంత మంది ఎక్ససైజ్ లాంటివి చేస్తే, ఇంకొంతమంది థెరపీ తీసుకోవడం, లేదా వాళ్లకి స్ట్రెస్ తగ్గించే పని చేయడం చేస్తూ ఉంటారు. ఒక మహిళ గత 16 సంవత్సరాల నుండి ప్రతి శుక్రవారం పెళ్లి కూతురుగా రెడీ అవుతుంది. వివరాల్లోకి వెళితే.
హీరా జీషన్, లాహోర్ లోని పంజాబ్ లో నివసిస్తున్నారు. హీరాకి 42 సంవత్సరాలు. 16 సంవత్సరాల క్రితం హీరా తల్లి బ్లడ్ క్యాన్సర్ కి గురయ్యారు. హీరా తల్లి పరిస్థితి క్షీణించడంతో లాహోర్ లోని గంగారాం ఆస్పత్రిలో చేర్చారు. చనిపోయేముందు హీరా తల్లి, హీరా వివాహం చేసుకోవడం తన చివరి కోరిక అని చెప్పారు.
దాంతో హీరా వారికి రక్తదానం చేసిన అతనిని పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగిన మరుసటి రోజు హీరా తల్లి మరణించారు. హీరా దంపతులకి ఆరుగురు సంతానం. వారిలో ఇద్దరు పుట్టినప్పుడు చనిపోయారు. దాంతో హీరా డిప్రెషన్ కి గురయ్యారు. ఈ సంఘటన జరిగిన తర్వాత నుంచి డిప్రెషన్ నుండి బయటకు రావడానికి హీరా ప్రతి శుక్రవారం పెళ్లి కూతురుగా రెడీ అవుతారు.
హీరా భర్త ప్రస్తుతం లండన్ లో ఉంటున్నారు. హీరా లాహోర్ లో పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. పెళ్లి కూతురుగా రెడీ అవ్వడం తనకి చాలా సంతోషాన్ని ఇస్తుందని, అలాగే ఒంటరితనాన్ని కూడా తగ్గిస్తుంది అని హీరా అన్నారు. అంతే కాకుండా ప్రతి మహిళ ఇలాగే తమకోసం ఒకరోజు కేటాయించుకోవాలి అని అన్నారు.