రామ్ హీరోగా నటించిన రెడ్ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల అవ్వబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఈ ఈవెంట్ లో రామ్, హీరోయిన్లు మాళవిక శర్మ, అమృత అయ్యర్, నివేత పేతురాజ్, దర్శకుడు కిషోర్ తిరుమల, నిర్మాత స్రవంతి రవి కిషోర్ పాల్గొన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గెస్ట్ గా వచ్చారు. రెడ్ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన తడం సినిమాకి రీమేక్.

ఇందులో రామ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నారు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించిన పాటలు ఇప్పటికే ఆన్లైన్లో విడుదలయ్యి విజయం సాధించాయి. ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. మధ్యలో సినిమా ఓటీటీ లో విడుదల అవుతుంది అనే వార్తలు వచ్చాయి. కానీ సినిమా బృందం మాత్రం డిజిటల్ రిలీజ్ చేయడానికి ప్రిఫర్ చేయలేదు. అలా ఇప్పుడు సినిమా థియేటర్లలో విడుదల అవుతోంది.

krack movie ticket in red pre release event

అయితే, రెడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలో ఉంది. అదేంటంటే. ఈవెంట్ లో సినిమా బృందం స్టే సేఫ్, సేవ్ సినిమా అని రాసి ఉన్న ఒక పెద్ద టికెట్ పట్టుకొని  మీడియాకి పోజ్ ఇచ్చింది. కానీ ఆ టికెట్ మీద క్రాక్ సినిమా పేరు రాసి ఉంది. తర్వాత మళ్లీ రెడ్ అని పేరు మార్చారు. దీనిపై సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2 #3 #4

#5

#6


#7

#8


#9

#10