మామూలుగా వర్షం పడినప్పుడు కరెంటు పోతూ ఉంటుంది. అది ఎందుకో మీకు తెలుసా? ట్రాన్స్ఫార్మర్ లో హై వోల్టేజ్ ఉంటుంది. ఒకవేళ వర్షం పడుతున్నప్పుడు చెట్లు విరగడం లాంటివి జరిగితే అవి ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ మీద పడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అందుకే వర్షం పడుతున్నప్పుడు విద్యుత్ సరఫరా ని ఆపేస్తారు.
అంతేకాకుండా ఒకవేళ వైర్లు ఏమైనా తెగిపోతే వర్షం నీళ్లతో పాటు కరెంట్ పాకి షాక్ కొట్టే ప్రమాదం ఉంది. మన భారతదేశంలో ఎలక్ట్రిసిటీ ఏర్పాట్లు అంత హైసెక్యూరిటీ తో ఉండవు. ఒకవేళ వర్షం పడుతున్నప్పుడు అలాగే వదిలేస్తే తర్వాత జరిగే నష్టాన్ని పూడ్చడానికి చాలా సమయం పడుతుంది. దాంతో ప్రజలు ఇంకా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
భారీ వర్షం అప్పుడు వచ్చే ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా ప్రమాదకరమే. మనము పిడుగుపాటు వల్ల మనుషులు చనిపోవడం అనేది వింటూనే ఉంటాం. మామూలుగానే అంత ప్రమాదకరమైన పిడుగు పాటు విద్యుత్ కి ఇంకా ప్రమాదకరం. గాలి వల్ల కూడా వైర్లు తెగడం, ఆ వైర్లలో నుండి మెరుపులు రావడం జరుగుతూ ఉంటాయి.
ఇంకొకటి ఓవర్ లోడింగ్. గాలివానలప్పుడు తెగిన వైర్లు ఒకదానితో ఒకటి తగిలి కరెంట్ ఓవర్ లోడ్ అయ్యే ప్రమాదముంది. దీనివల్ల పవర్ సప్లై అనేది మామూలు ఓల్టేజ్ కంటే కూడా ఎక్కువగా అవుతుంది. దాంతో మొత్తం ఎలక్ట్రిసిటీ లైన్ పాడవుతుంది. అందుకే భారీ వర్షాలప్పుడు కరెంటు కట్ చేస్తారు.