చాలా మంది బిగ్ బాస్ ప్రోగ్రాం కి వెళ్ళేది పాపులారిటీ కోసం. ఆ షోలో వచ్చిన పాపులారిటీ ద్వారా వాళ్లకి అవకాశాలు వస్తాయి అన్న ఉద్దేశంతోనే చాలా మంది బిగ్ బాస్ కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు. అదే కొంత మంది కంటెస్టెంట్స్ విషయంలో నిజమైంది కూడా. బిగ్ బాస్ సీజన్ 1 లో వచ్చిన హరితేజ, షోకి రాకముందు కూడా సీరియల్స్, సినిమాలు చేసేవారు.  కానీ షో తర్వాత ఎన్నో పెద్ద సినిమాల్లో కనిపిస్తున్నారు.

అలాగే జెర్సీ సినిమాలో పెద్దయిన తర్వాత నాని కొడుకుగా చివరిలో వచ్చిన అతను మీ అందరికీ గుర్తుండే ఉంటారు. అతని పేరు హరీష్ కళ్యాణ్.  హరీష్ కళ్యాణ్ తమిళ్ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొని, రెండవ రన్నరప్ గా నిలిచారు. బిగ్ బాస్ తర్వాత హరీష్ కళ్యాణ్ తమిళ్ లో ఎన్నో సినిమాలు చేశారు. కంటెస్టెంట్స్ సంగతి పక్కన పెడితే, బిగ్ బాస్ విజేతలుగా నిలిచిన వాళ్లు తర్వాత కెరియర్ పరంగా ఎలా సాగుతారో చెప్పడం కష్టం.

బిగ్ బాస్ సీజన్ వన్ విజేత అయిన శివబాలాజీ తర్వాత తన ప్రొడక్షన్ లో ఒక సినిమాలో కనిపించారు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. బిగ్ బాస్ రెండవ సీజన్ విజేత కౌశల్. షో విజేత అయిన తర్వాత ఎన్నో పెద్ద ప్రాజెక్ట్స్ లో అవకాశాలు  వచ్చాయి అనే వార్తలు వినిపించాయి. కౌశల్ షో విజేతగా నిలిచి రెండు సంవత్సరాలయింది. తర్వాత ఎన్నో షోస్ లో కనిపించారు.

మూడవ సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్. రాహుల్ కూడా బిగ్ బాస్ కి ముందులాగానే తన సింగింగ్ కెరియర్ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు నాలుగవ సీజన్ విజేత అభిజిత్. అభిజిత్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. తరువాత కొన్ని సినిమాలు చేసినా కూడా అవి అంత గుర్తింపుని ఇవ్వలేదు.

ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను అని అన్నారు అభిజిత్. దాంతో కొంత మంది ప్రేక్షకులు “ప్రస్తుతం వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి అభిజిత్ కి కూడా మంచి వెబ్ సిరీస్ లో నటించే అవకాశాలు వస్తాయేమో” అని అంటుంటే ఇంకొంతమంది మాత్రం అభిజిత్ తదుపరి సినిమా అనౌన్స్మెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.