మూడు నెలలు అలా గడిచిపోయాయి. అప్పుడే బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రావడం, అయిపోవడం కూడా జరిగిపోయింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ సీజన్ లో  మోనాల్ గజ్జర్, అభిజిత్, మెహబూబ్, అఖిల్ సార్థక్, గంగవ్వ, సయ్యద్ సోహెల్ రయాన్, కరాటే కళ్యాణి, అరియానా గ్లోరీ, లాస్య, దివి, అలేఖ్య హారిక, నోయల్, జోర్దార్ సుజాత, అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి, సూర్య కిరణ్ కంటెస్టెంట్స్ గా పాల్గొన్నారు.

అంతేకాకుండా ఈ రోజుల్లో, బస్టాప్, బ్రాండ్ బాబు సినిమాల్లో నటించిన కుమార్ సాయి, జబర్దస్త్ ఫేమ్ అవినాష్, జంప్ జిలాని ఫేమ్ స్వాతి దీక్షిత్ బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. అవినాష్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఒకసారి తన షోస్ అన్ని వదులుకొని వచ్చాను అని అన్నారు. ఈ విషయంపై చర్చ మొదలైంది. కానీ తర్వాత అలాంటిదేమీ లేదు అనే వార్త వచ్చింది. ఈ విషయంపై అవినాష్ ఇటీవల స్పందించారు.

jabardasth avinash bigg boss

అవినాష్ మాట్లాడుతూ ” నాకు బిగ్ బాస్ కి రమ్మని కాల్ వచ్చింది. షో యాజమాన్యాన్ని బిగ్ బాస్ కి వెళ్తాను అని అడిగాను. కానీ అగ్రిమెంట్ మధ్యలో వెళ్ళిపోతే పది లక్షల రూపాయలు కట్టాలి అని చెప్పారు. నేను ఎనిమిది సంవత్సరాల నుండి వాళ్ల దగ్గర చేస్తున్నాను అని, సహాయం చేయమని అడిగాను వారి దగ్గర కూడా డబ్బులు లేవు అన్నారు.

నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని నేను బిగ్ బాస్ కి వెళ్తాను అంటే 10 లక్షలు కట్టమన్నారు. నేను ఏదో 2 లక్షలు, 3 లక్షలు కట్టించుకుంటారు ఏమో అనుకున్నాను కానీ పది లక్షలు కట్టమన్నారు. నేను ఈ విషయంలో వాళ్ళని తప్పు పట్టడం లేదు. వాళ్ల అగ్రిమెంట్ వాళ్లు ఫాలో అవుతారు. ఆ 10 లక్షల కోసం చాలా మంది దగ్గర అప్పు చేశాను.

చమ్మక్ చంద్ర, శ్రీముఖి వీళ్ళందరూ నాకు సహాయం చేశారు. అలా జబర్దస్త్ కి 10 లక్షల రూపాయలు కట్టి బిగ్ బాస్ కి వెళ్లాను. బిగ్ బాస్ తో వచ్చిన డబ్బుతో నా అప్పులన్నీ తీర్చాను”. అని అన్నారు. ఇప్పటికి కూడా తనకి జబర్దస్త్ కి వెళ్లాలని ఎక్కడో చిన్న ఆశ ఉందని కానీ వాళ్లు రావద్దు అని అన్నారని చెప్పారు.

watch video :