సాధారణంగా కొంతమంది ఎవరినైనా పిలవాలంటే ఆంటీ లేదా అంకుల్ అని పిలుస్తారు. వాళ్ళు వయసులో తమ కంటే ఎంత పెద్ద అనే విషయాన్ని అసలు పట్టించుకోరు. ఒక నాలుగైదు సంవత్సరాలు తేడా ఉన్నా కూడా ఆంటీ లేదా అంకుల్ అని పిలుస్తారు. చాలా మందికి ఇలా పిలిస్తే కోపం వస్తుంది.

కొంత మంది విని వదిలేస్తారు. కొంత మంది మాత్రం అలా పిలవద్దు అని చెబుతారు. ఇంకొంత మంది అయితే కొంచెం గట్టిగానే రిప్లై ఇస్తారు. ఒక్కొక్కసారి చేతులకి కూడా పని చెప్తారు. దానికి ఇటీవల జరిగిన ఒక సంఘటనే ఉదాహరణ. ఉత్తరప్రదేశ్ లోని ఈటా లో బాబూగంజ్ మార్కెట్ లో షాపింగ్ చేసుకుంటున్న ఒక మహిళను అక్కడే ఉన్న ఒక యువతి ఆంటీ అని పిలిచింది.

దాంతో కోపం తెచ్చుకున్న ఆ మహిళ ఆ యువతిని కొట్టడం మొదలు పెట్టింది. ఇంకొంత మంది మహిళలు కూడా ఆ మహిళకి సహాయం చేశారు. అక్కడే ఉన్న ఒక లేడీ పోలీస్ రంగంలోకి దిగి గొడవని ఆపారు. ఈ విషయంపై ఎలాంటి కేసు నమోదు అవ్వలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
watch video :
https://www.youtube.com/watch?v=KhHT9ba3x5Y


#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12










#2
#3
#4
#5
#6
#7

#10








#2
#3
#4
#5
#6
అలాగే తన సొంత క్లోతింగ్ బ్రాండ్ కూడా మొదలు పెట్టారు. అంతే కాకుండా వీగన్ లైఫ్ స్టైల్ గురించి కూడా చెప్పారు. ఇవన్నీ కాకుండా తరచుగా నెటిజన్లతో కూడా సమంత ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అప్పుడప్పుడు కొన్ని కామెంట్స్ కి కూడా రిప్లై ఇస్తూ ఉంటారు.
ఇవాళ సమంత ఒక ఫోటో పోస్ట్ చేశారు. ఆ ఫోటో కి కామెంట్ పెట్టిన ఒక నెటిజన్ కి క్రేజీ గా రిప్లై ఇచ్చారు సమంత. సమంత ఫోటోకి ఒక నెటిజన్ ” చై (నాగ చైతన్య) కి డివోర్స్ ఇచ్చేయ్. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం”. అని కామెంట్ పెట్టారు. దానికి సమంత ” కష్టం. ఒక పని చెయ్. చై ని అడుగు” అని రిప్లై ఇచ్చారు. సమంత ఇలా సరదాగా ఇచ్చిన రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో ట్రెండింగ్ లో ఉంది.







