సంక్రాంతి పండుగ కానుకగా చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. వీటిలో నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : నా సామిరంగ
- నటీనటులు : నాగార్జున, ఆషికా రంగనాథ్ , అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సార్ ధిల్లాన్, మిర్నా మీనన్ తదితరులు
- నిర్మాత : శ్రీనివాస చిట్టూరి
- దర్శకత్వం : విజయ్ బిన్ని
- సంగీత దర్శకత్వం : ఎం.ఎం.కీరవాణి
- విడుదల తేదీ : జవనరి 14, 2024
స్టోరీ :
కథ విషయానికి వస్తే ఈ సినిమా 1963 లో మొదలవుతుంది. కిష్టయ్య (నాగార్జున), అంజి (అల్లరి నరేష్) స్నేహితులు. వీరిద్దరి చిన్నతనాన్ని ఈ సమయంలో చూపిస్తారు. ఆ తర్వాత సినిమా 1988 కి షిఫ్ట్ అవుతుంది. అప్పుడే భాస్కర్ (రాజ్ తరుణ్) వీరి జీవితాల్లోకి ప్రవేశిస్తాడు. కిష్టయ్య వరలక్ష్మి అలియాస్ వరాలు (అషిక రంగనాథ్) అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వీరి ప్రేమ కథ ఎంత దూరం వెళ్ళింది? వీరి జీవితాల్లో చోటుచేసుకున్న మార్పులు ఏంటి? కిష్టయ్య ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ:
సాధారణంగా సంక్రాంతి పండక్కి నాగార్జున సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి. ఈసారి కూడా అదే పద్ధతి కొనసాగిస్తూ నా సామిరంగ సినిమాని ఖచ్చితంగా పండగకి విడుదల చేయాలి అనే పట్టుదలతో పూర్తి చేశారు. ఇది పక్కా పండుగ సినిమా. సినిమా చూస్తున్నంత సేపు కూడా పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. కథ విషయానికి వస్తే, మలయాళంలో రూపొందిన పొరింజు మరియం జోస్ సినిమాకి ఇది రీమేక్. స్టోరీ లైన్ బలంగా ఉంటుంది. కథ తెలిసినదే అయినా కూడా ఎమోషన్స్ ఉంటాయి. ఇదే కథని తెలుగులోకి తగ్గట్టు మార్పులు చేశారు.
ఆ మార్పులు కొంత వరకు బాగానే వర్క్ అవుట్ అయినా కూడా, కొంత వరకు తెలిసిపోతూ ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ బానే చేశారు. కానీ నాగార్జున మాత్రం హైలైట్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా నాగార్జున మాత్రమే కనిపిస్తారు. అంటే అంత బాగా చేశారు అని అర్థం. అల్లరి నరేష్ కూడా హైలైట్ అయ్యారు. రాజ్ తరుణ్ భాస్కర్ పాత్రలో తన పాత్రకి తగ్గట్టుగా నటించారు. కీరవాణి అందించిన పాటలు కూడా సినిమాకి తగ్గట్టు ఉన్నాయి. కానీ సినిమా చూస్తున్నంత సేపు కూడా కొన్ని చోట్ల ఎక్కడో ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సినిమా బాగానే నడుస్తూ ఉంటుంది. యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. అయినా కూడా కొన్ని ఎపిసోడ్స్ లో ఇంకా జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
సినిమాటోగ్రఫీ బాగుంది. కలర్ ఫుల్ గా కనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ డిజైన్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ లో వచ్చే ఒక నాగార్జున పాత సినిమా రిఫరెన్స్ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే మాత్రం కాస్త బలహీనంగా అనిపిస్తుంది. అక్కడక్కడ సాగదీసినట్టు ఉంటుంది. కొన్ని ఎమోషన్స్ ప్రేక్షకులకి అంతగా కనెక్ట్ అవ్వవు.
ప్లస్ పాయింట్స్ :
- నాగార్జున నటన
- కొన్ని యాక్షన్ సీన్స్
- ఇంటర్వెల్ సీక్వెన్స్
- పాటలు
మైనస్ పాయింట్స్:
- తెలిసే కథ
- హీరో, హీరోయిన్ లవ్ స్టోరీ
- కొన్ని చోట్ల ల్యాగ్ అయిన స్క్రీన్ ప్లే
- కనెక్ట్ అవ్వని ఎమోషన్స్
రేటింగ్:
3/5
ట్యాగ్ లైన్:
పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా, ఒక సోగ్గాడే చిన్ని నాయన లాంటి సరదాగా సాగిపోయే సినిమా చూద్దాం అని అనుకునే వారికి నా సామిరంగ సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.
watch trailer :