HANUMAN REVIEW : “తేజ సజ్జా” నటించిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

HANUMAN REVIEW : “తేజ సజ్జా” నటించిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

సంక్రాంతి బరిలోకి చాలా సినిమాలు దిగుతున్నాయి. అందులో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా నటించిన హనుమాన్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా విడుదలకి ముందు రోజే ప్రీమియర్స్ వేశారు. ఇవాళ ఈ సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : హనుమాన్
  • నటీనటులు : తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్.
  • నిర్మాత : కె. నిరంజన్ రెడ్డి
  • దర్శకత్వం : ప్రశాంత్ వర్మ
  • సంగీతం : గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్
  • విడుదల తేదీ : జనవరి 12, 2024

స్టోరీ :

అంజనాద్రి అనే ఊరిలో హనుమంతు (తేజ సజ్జా) చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ తిరుగుతూ ఉంటాడు. హనుమంతుని చిన్నప్పటి నుండి అక్క అంజమ్మ (వరలక్ష్మి) పెంచి పెద్ద చేస్తుంది. ఆ ఊరిలో ఉండే పాలెగాడు గజపతి (దీపక్ శెట్టి) ఊరి మీద తన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటాడు. హనుమంతు మీనాక్షి (అమృత అయ్యర్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. మరొక పక్క సౌరాష్ట్రలో ఉండే మైఖేల్ (వినయ్ రాయ్) సూపర్ హీరో సినిమాలు చూసి పెరిగి సూపర్ హీరో అవ్వాలి అనుకుంటాడు. ఎన్నో ప్రయత్నాలు విఫలించాక సూపర్ హీరో పవర్ కనిపెట్టడానికి మరొక ప్రయత్నం చేస్తూ ఉంటాడు.

మీనాక్షి గజపతికి ఎదురు తిరుగుతుంది. ఈ కారణంగా మీనాక్షి మీద గజపతి దాడి చేయించడానికి ప్రయత్నం చేస్తాడు. మీనాక్షిని కాపాడటానికి హనుమంతు గజపతికి ఎదురు తిరుగుతాడు. అప్పుడు హనుమంతుని కొట్టి నీటిలో పడేస్తారు. అక్కడ హనుమంతుకి ఆంజనేయస్వామి రక్త బిందువుతో ఉన్న ఒక రుధిరమణి దొరుకుతుంది. అది చేతికి వచ్చాక హనుమంతు జీవితం మారిపోతుంది. అప్పుడు హనుమంతు ఏం చేశాడు? హనుమంతు హను-మ్యాన్ గా ఎలా మారాడు? తన ఊరి వారిని కాపాడాడా? హనుమంతు సమస్యలను ఎలా పరిష్కరించాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

సూపర్ హీరో సినిమాలు అంటే చాలా మంది ఇష్టపడతారు. హాలీవుడ్ నుండి ఎన్నో సూపర్ హీరో సినిమాలు వచ్చాయి. కానీ మన తెలుగు సూపర్ హీరో సినిమాలు మాత్రం చాలా తక్కువ. ఇది అలాంటి ఒక తెలుగు సూపర్ హీరో సినిమా. కథ విషయానికి వస్తే కాస్త తెలిసిన కథలాగానే అనిపిస్తుంది. ఒక మామూలు వ్యక్తి సూపర్ హీరోగా ఎలా మారాడు అనే అంశం మీద సినిమాలు వచ్చాయి. ఇది కూడా అలాంటి ఒక సినిమానే. కానీ టేకింగ్ పరంగా మాత్రం కొత్తగా అనిపిస్తుంది.

సినిమా చూసే ప్రేక్షకుడిని మొదటి నుండి చివరి వరకు ఎక్కడా బోర్ కొట్టించకుండా సినిమాకి ఎంగేజ్ అయ్యేలాగా చేస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో నటించిన వాళ్లు అందరూ కూడా బాగా నటించారు. హీరో తేజ హనుమంతు అనే పాత్రలో బాగా నటించారు. మిగిలిన పాత్రలు పోషించిన వాళ్ళు అందరూ కూడా వారి పాత్రలకి తగ్గట్టు నటించారు. సత్య, జబర్దస్త్ శ్రీనుకి కూడా మంచి పాత్రలు దొరికాయి. పాటలు పర్వాలేదు. అంత గుర్తుండిపోయే అంత గొప్పగా ఏమీ అనిపించవు.

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాకి తగ్గట్టు ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంచుకున్న పాయింట్ బాగుంది. తెరకెక్కించిన విధానం కూడా బాగుంది. సినిమాకి ఎండింగ్ లో జై హనుమాన్ ఈ సినిమా నెక్స్ట్ పార్ట్ అని, ఆ సినిమా 2025 లో విడుదల అవుతుంది అని చెప్పారు. ఒక మంచి కాన్సెప్ట్ తో సినిమా ముగించారు. రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి? అనే ఒక ప్రశ్నతో సినిమా ఎండ్ అవుతుంది. కానీ కొన్నిచోట్ల మాత్రం సినిమా చాలా స్లోగా అనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే సినిమా ఇంకా బాగుండేది ఏమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్
  • కొన్ని గ్రాఫిక్స్
  • నటీనటుల పర్ఫార్మెన్స్
  • హనుమంతుడి సీన్స్

మైనస్ పాయింట్స్:

  • స్లోగా సాగే కొన్ని సీన్స్
  • విలన్ పాత్రని చూపించిన విధానం

రేటింగ్ :

3.25/5

ట్యాగ్ లైన్ :

అక్కడక్కడ స్లోగా ఉన్నా కూడా సినిమా ప్రేక్షకులని అలరిస్తుంది. హనుమంతుడి సీన్స్ కూడా తెరపై చాలా బాగా చూపించారు. మంచి కంప్యూటర్ గ్రాఫిక్స్ తో, మంచి టేకింగ్ తో వచ్చిన ఒక తెలుగు సూపర్ హీరో సినిమాగా హనుమాన్ నిలుస్తుంది.

watch trailer :


End of Article

You may also like