ప్రభాస్ మరియు నాగ్ అశ్విన్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రాజెక్ట్ కె. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ గ్లింప్స్‌కు 13 మిలియన్ల వ్యూస్ వచ్చాయి అంటే మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయో అర్థమవుతుంది.
దీపిక ,అమితాబ్ మరియు కమల్ హాసన్ లాంటి ఎందరో అగ్రనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ మూవీ గ్లింప్స్‌కు మహాభారతానికి మధ్య లింకు ఉంది అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి.
ప్రాజెక్ట్ కె మూవీకి కల్కి 2889 ఏడీ అని టైటిల్ కన్ఫామ్ చేసిన విషయం తెలిసిందే. ఇది ఒక ఫ్యూచర్ సైన్స్ ఫిక్షన్ మూవీ అన్న విషయం ఇప్పటికే అందరికీ అర్థమైంది. ఈ మూవీ గురించి మాట్లాడుతూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తను సైన్స్ ఫిక్షన్ మరియు పురాణాలను ఎక్కువగా ఇష్టపడతాను అని అన్నారు. చిన్నప్పటి నుంచి స్టార్ వార్స్ మరియు మహాభారతం చూస్తూ పెరిగిన తనకి ఇప్పుడు ఈ రెండు ప్రపంచాలను కలిపి ప్రాజెక్టు కె గా సినిమా తీయడం ఎంతో గర్వంగా ఉంది అని అన్నారు.
ఈ నేపథ్యంలో ఈ చిత్రం డ్యూన్ అనే నవల ఆధారంగా నిర్మించబడింది అని తెలుస్తుంది. ఈ ఒక్క చిత్రమే కాదు ప్రపంచ దేశాలలో ఇప్పటివరకు తెరకెక్కించిన ఎన్నో సినిమాలకు ఈ నవలే స్ఫూర్తిదాయకమట. ఇది 1965లో రచించినటువంటి ఒక సైన్స్ ఫిక్షన్ నావెల్. 800 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి మూవీ లో ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది.
ఈ మూవీతో ప్రభాస్ భవిష్యత్తు అంతకంత పెరుగుతుందట. వచ్చే సంవత్సరం ప్రభాస్ హీరోగా రెండు లేదా మూడు సినిమాలు రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ మారుతి కాంబినేషన్లో ఒక సినిమా చిత్రీకరిస్తుండగా సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ప్రభాస్ రెమ్యూనరేషన్ 100 నుంచి 150 కోట్ల వరకు ఉంది. కల్కి ఊహించిన విధంగా క్లిక్ అయితే రమ్యునరేషన్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ALSO READ : సీనియర్ ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవో తెలుసా..? ఆయన ఎలాంటి ఆహారం తీసుకునే వారు అంటే..?