బాలీవుడ్ హీరోయిన్ మల్లికా శెరావత్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆమె తన సినిమాలతో వార్తల్లో నిలుస్తూ ఉండేది. ‘ఖ్వాహిష్’ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మల్లికా శెరావత్ ‘మర్డర్’ చిత్రంతో పాపులారిటీ తెచ్చుకుంది.
ఆ మూవీ నుండి ఎక్కువగా బోల్డ్ క్యారెక్టర్స్ లో నటించిన మల్లికా, పలు చిత్రాలలో ఐటెం సాంగ్స్ లో కూడా నటించింది. లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన దశావతారం మూవీలో కూడా మల్లికా శెరావత్ నటించింది. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం..
మల్లికా షెరావత్ 1976 లో అక్టోబరు 24న హర్యానాలోని చిన్న గ్రామం మోథ్ లో జన్మించింది. ఆమె తండ్రి పేరు ముఖేష్ కుమార్ లాంబా. వారిది సంప్రదాయ కుటుంబం. ఆమె అసలు పేరు రీమా లాంబా. ఇండస్ట్రీలో రీమా పేరుతో ఇతర నటీమణులతో ఉండడంతో తన పేరును మల్లికా గా మార్చుకుంది. షెరావత్ మల్లికా తల్లి పుట్టింటి ఇంటి పేరు. తల్లి ఇచ్చిన మద్దతు వల్ల ఆ పేరును ఉపయోగిస్తున్నానని ఒక సందర్భంలో ఆమె చెప్పింది.
మల్లికా షెరావత్ మధుర రోడ్ లో ఉండే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ప్రాధమిక విద్యను పూర్తి చేసింది. ఢిల్లీ యూనివర్సిటీ మిరాండా హౌస్ లో డిగ్రీ చేసింది. మల్లిక సినిమాల్లో నటించడం తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆమె ఇంట్లో నుండి పారిపోయి వచ్చి, హిందీలో ఎంట్రీ ఇచ్చింది. మర్డర్ మూవీతో ఆమెకు గుర్తింపు వచ్చింది. వరుస సినిమాలలో నటిస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది.

2019 లో బూ సబ్కీ ఫటేగి అనే హారర్ కామెడీ వెబ్ సిరీస్ లో చివరిసారిగా నటించింది. ఏక్తా కపూర్ రూపొందించిన ఈ వెబ్ సిరీస్ లో తుషార్ కపూర్, సంజయ్ మిశ్రా, కృష్ణ అభిషేక్, కికు శారదా వంటివారు నటించారు. ఇందులో మల్లికా దెయ్యంగా నటించింది. ఆ తరువాత బాలీవుడ్‌ను విడిచి యుఎస్‌కు వెళ్ళింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఆమె మళ్ళీ నటించబోతున్నట్టు తెలుస్తోంది.
https://www.instagram.com/p/Cv4CrNvP7TE/
Also Read: బాహుబలి లాంటి సినిమాలని మించిన కథ..! అసలు అంతగా ఏం ఉంది ఇందులో..?

మలయాళ హీరో కున్‌చకో బొబన్ మలయాళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ఆడియెన్స్ కి సుపరిచితుడే. కున్‌చకో బొబన్ హీరోగా నటించిన మలయాళ మూవీ ‘పద్మిని’ జులై 14న థియేటర్లలో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి సెన్నా హెగ్డే తెరకెక్కించారు. ఈ మూవీలో మడోన్నా సెబాస్టియన్, అపర్ణా బాలమురళి, విన్సీ అలోషియస్, సజిన్, మాళవిక మేనన్ నటించారు. ఈ మూవీ కథ విషయానికి వస్తే, ఒక కాలేజీలో రమేష్ (కున్‌చకో బొబన్) ప్రొఫెసర్‌గా వర్క్ చేస్తుంటాడు. అతను కథలు కూడా రాస్తుంటాడు.
రమేష్ ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడతాడు. కానీ మొదటి రాత్రే రమేష్ భార్య లవ్ చేసిన వ్యక్తితో వెళ్లిపోతుంది. ఆ తరువాత రమేష్ తల్లిదండ్రులు అతనికి రెండవ పెళ్లి చేయాలని భావిస్తారు. దానికి రమేశ్ కూడా ఒప్పుకోవడంతో పెళ్లి సంబంధం చూస్తారు. అయితే ఆ అమ్మాయి పేరెంట్స్ రమేష్ కు అధికారికంగా విడాకులు వస్తేనే తమ కూతురుని ఇస్తామని షరతు పెడతారు.
అయితే భార్య ఎక్కడికి వెళ్లిందో తెలియని రమేశ్ ఆమెను ఎలా వెతికి, పట్టుకున్నాడు? ఆమెను వెతికే క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? రమేష్ కు లాయర్ (అపర్ణా బాలమురళి) ఎలా సహాయం చేసింది. చివరికి రమేష్ రెండవ పెళ్లి చేసుకున్నాడా? లేదా ఇంతకీ కథలో పద్మిని ఎవరు? అనేది మిగతా కథ.
లోపల బాధను ఉంచుకుని, పైకి బాధ కనిపించకుండా నవ్వుతూ కనిపించే రమేశ్ క్యారెక్టర్ లో కున్‌చకో బొబన్ ఒదిగిపోయారు. లాయర్ గా అపర్ణ బాలమురళీ నటన బాగుంది. సజిన్ కామెడీ టైమింగ్, మడోన్నా సెబాస్టియన్, విన్సీ అలోషియస్, మాళవిక మేనన్, అలరిస్తారు. పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. విజువల్స్ బాగున్నాయి. అనుకున్న స్టోరీని తెరకెక్కించడంలో డైరెక్టర్ సెన్నా హెగ్డే సక్సెస్ అయ్యాడు.
జైలర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. తెలుగులో కూడా భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ మూవీలో తమన్నా, రమ్యకృష్ణ నటించారు. జైలర్ సక్సెస్ లో స్పెషల్ క్యామియోలు కీలకమైన పాత్రను పోషించాయి. డైరెక్టర్ ఈ మూవీ కోసం ఇతర ఇండస్ట్రీల నుండి స్టార్ హీరోలను తీసుకున్నారు.
కన్నడ ఇండస్ట్రీ నుండి శివ రాజ్ కుమార్, మలయాళ ఇండస్ట్రీ నుండి మోహన్ లాల్, బాలీవుడ్ నుండి జాకీష్రాఫ్ వంటివారిని తీసుకున్నారు. వారి పాత్రలు కూడా బాగున్నాయి. వీరిలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ క్యారెక్టర్ ఇంపాక్ట్ ఆడియెన్స్ లో బలంగా ఉందని చెప్పవచ్చు. అయితే తెలుగు ఇండస్ట్రీ నుండి సునీల్ తీసుకున్నారు. అది కూడా కామెడీ హీరో క్యారెక్టర్.
కోలీవుడ్ ఆడియెన్స్ కి ఈ క్యారెక్టర్ నచ్చినప్పటికి, తెలుగు ఆడియెన్స్ కొందరు మాత్రం సునీల్ పాత్రని ట్రోల్ చేసినట్టుగా ఉందని అంటున్నారు. మిగతా ఇండస్ట్రీల నుండి అగ్ర హీరోలను తీసుకుని, పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో చూపించారని. తెలుగు నుండి సునీల్ వంటి నటుడిని తీసుకుని, కమెడియన్ గా చూపించారని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మూవీ హిట్ అయ్యిందని నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు.
ఇంగ్లండ్ లో జరుగుతున్న వన్డే కప్ టోర్నీలో ఓపెనర్ పృథ్వీ షా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 23వ మ్యాచ్‌లో సోమర్సెట్ పై డబుల్ సెంచరీ చేసిన షా, అనంతరం డర్హామ్ పై కూడా సెంచరీ కొట్టాడు. డర్హామ్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్తాంప్టన్‌షైర్ ఓపెనర్ గా వచ్చిన పృథ్వీ, 76 బంతుల్లో 7 సిక్సర్లు, 15 ఫోర్లతో 125 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ 125 రన్స్ తో పృథ్వీ షా ‘లిస్ట్ ఏ’ క్రికెట్లో మూడు వేల పరుగులను చేశాడు.
పృథ్వీ షా సాధించిన రికార్డులు..
తెలుగులో అందుబాటులో లేకపోవడంతో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ సిరీస్ ను చూసినవారెంతో మంది ఉన్నారు. తెలుగులో గేమ్ ఆఫ్ థ్రోన్స్ లేదని చాలా మంది ఫ్యాన్స్ బాధ పడుతుండేవారు. అయితే త్వరలో తెలుగులో గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ రాబోతుంది. నెట్ ఫ్లిక్స్ తర్వాత ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ పార్టనర్ గా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ మారింది. కానీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో లేదు.
ఆ స్ట్రీమింగ్ హక్కులను జియో సినిమా తీసుకుంది. స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న తరువాత జియో సినిమా భారతీయ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అభిమనులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వెబ్ సిరీస్ జియో సినిమాలో తెలుగు, మలయాళం, తమిళ, కన్నడ, హిందీ భాషలలో కూడా స్ట్రీమ్ అవనుంది. ఈ న్యూస్ విన్నప్పటి నుండి ఎప్పుడెప్పుడు ప్రాంతీయ భాషలలో స్ట్రీమ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.
ఇది ఇలా ఉంటే బాహుబలి 2 సినిమాలోని సన్నివేశాలు గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుండి కాపీ చేశారని బాహుబలి ట్రైలర్ రిలీజ్ అయినపుడు విమర్శలు వచ్చాయి. బాహుబలి పై నుండి వస్తున్న అగ్ని బాణాలకు ఆకాశం వైపు చూస్తూ చేతులు తెరుస్తాడు. ఇలాంటి సీన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఉంటుంది. అలాగే అమరేంద్ర బాహుబలి ఖడ్గం లాంటి ఆయుధం కూడా ఆ సిరీస్ లో కనిపిస్తుంది.
సూపర్ స్టార్ రజినికాంత్ మూవీ విజయం సాధించి చాలా ఏళ్లు అవుతోంది. అందువల్ల మొదట్లో ఏమాత్రం అంచనాలు లేని జైలర్ మూవీ, ట్రైలర్ తో రిలీజ్ కు ముందు మంచి హైప్ తెచ్చుకుంది. రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ క్యామియో రోల్స్ లో కనిపించారు. తమన్నా, సునీల్, వినాయకన్ కీలకపాత్రలలో నటించారు.
అయితే ఈ మూవీలో రజినీకాంత్ కోడలి పాత్రలో కనిపించిన నటి కూడా హీరోయిన్ అనే విషయం చాలామందికి తెలియదు. ఆమె తెలుగు చిత్రాలలో కూడా హీరోయిన్ గా నటించింది. ఆమె అసలు పేరు అదితి. ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత మిర్నా మేనన్గా మారింది. టాలీవుడ్ లో ఆది సాయికుమార్ హీరోగా నటించిన ‘క్రేజీ ఫెలో’, అల్లరి నరేశ్ హీరోగా వచ్చిన ‘ఉగ్రం’లో కూడా హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
మిర్నా మేనన్ కేరళలో ఇడుక్కిలో జన్మించింది. ఇండస్ట్రీకి రాకముందు ఆమె సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేసింది. ఆ తరువాత ఆమె ఫొటోలని చూసి ఒక దర్శకుడు తన మూవీలో అవకాశం ఇచ్చాడు. ఆ విధంగా 2016లో ‘పట్టదారి’ అనే సినిమాలో నటించింది. ఆ తరువాత ‘కలవని మప్పిలై’ అనే సినిమాలో నటించింది. కోలీవుడ్ లో రెండు చిత్రాలు చేసిన తరువాత మలయాళంలో మోహన్‌లాల్ నటించిన ‘బిగ్ బ్రదర్’ మూవీలో నటించింది. అలా ఆమెకు గుర్తింపు వచ్చింది.
కానీ ఇటీవల కాలంలో ప్రసారం అవుతున్న కొన్ని సీరియల్స్ లోని సన్నివేశాలు లాజిక్స్ కి దూరంగా తీస్తున్నారు. ఇలాంటి సన్నివేశాలను చూసిన నెటిజన్లు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, వైరల్ చేస్తున్నారు. ఇలా పలు సీరియల్స్ లోని సీన్లు వాస్తవానికి దూరంగా ఉండడంతో నెట్టింట్లో విపరీతమైన ట్రోలింగ్ కి గురవుతున్నాయి.
తాజాగా ప్రసారం అయిన ఒక హిందీ సీరియల్ లో టెలిఫోన్ వైర్ దాని ఒక వ్యక్తిని చంపడానికి ప్రయత్నించే సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో అయితే ఇలాంటివాటిని అంతగా ప్రేక్షకులు పట్టించుకొనే వారు కాదు. అయితే ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరగడంతో ఇలాంటి సన్నివేశాల పై విపరితమైన ట్రోల్స్ పెరుగుతున్నాయి. తాజాగా ఒక హిందీ సీరియల్ కు చెందిన సీన్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సదరు సీరియల్ లో ఒక వ్యక్తి కాల్ మాట్లాడుతూ నడుస్తూ, జారీ కిందపడతాడు. అయితే ఈ క్రమంలో అతని చెయ్యి టెలిఫోన్ ను తాకుతుంది. దాంతో రిసీవర్ ఎగిరి పైన తిరుగుతున్న ఫ్యాన్ పై నుండి కిందికి వచ్చి అతని మెడకు చుట్టుకుంటుంది. ఆ వైర్ అలా వస్తూనే, అతని మెడకి మరింతగా చుట్టుకుంటూ ఉంటుంది. అంతలోనే ఆ గదిలోకి వచ్చిన వారు అతన్ని కాపాడడానికి ప్రయత్నిస్తారు. ఇక ఈ సీన్ చూసిన నెటిజెన్లు ‘ఎలా వస్తాయి రా ఇలాంటి ఐడియాలు’ అంటూ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.


దాదాపు పదేళ్ళ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన మూవీ భోళా శంకర్. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించారు. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటించగా, కీలక పాత్రలో యంగ్ హీరో సుశాంత్ నటించారు. ఈ మూవీ ఆగస్ట్ 11 న విడుదల అయ్యి, మొదటి షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీలోనీ సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, మీమ్స్ క్రియేట్ చేస్తూ నెటిజెన్లు ఈ మూవీని, మెహర్ రమేష్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
సినిమా పోయి మేకర్స్ దగ్గర నుండి అభిమానుల వరకు బాధలో ఉంటే, మరో వైపు ఈ మూవీ ప్లాప్ అవడం కూడా మంచిదే అని కొందరు అంటున్నారు. ఇది అన్నది సినీ ప్రేక్షకులు కాదు, టీమిండియా అభిమానులు. అలా అనడానికి కారణం ఏమిటంటే, 2011లో మెహర్ రమేశ్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తీసిన ‘శక్తి’ మూవీ రిలీజ్ అయ్యి, డిజాస్టర్ గా నిలిచింది. అయితే అదే ఏడాది ధోనీ సేన వన్డే ప్రపంచ కప్ ను సాధించింది. ఇది భారత్ గెలిచిన రెండవ ప్రపంచ కప్.
ఆ తరువాత 2013లో మెహర్ రమేష్ వెంకటేశ్ హీరోగా తీసిన ‘షాడో’ మూవీ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే అదే ఏడాది భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని సాధించింది. ఇక ఈ ఏడాది కూడా ప్రపంచ కప్ జరగనుంది. మెహర్ రమేశ్ తీసిన భోళా శంకర్ మూవీ ప్లాప్ అవడం అటు చిరంజీవికి, ఇటు మెగా ఫ్యాన్స్‌కు ఊహించని విధంగా షాకిచ్చింది. మెహర్ రమేష్ ప్లాప్ సెంటిమెంట్ కొనసాగితే, ఈ ఏడాది కూడా ప్రపంచ కప్ ఇండియాదే అని టీమిండియా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
టీటీడీఎఫ్ఓ శ్రీనివాసులు బీబీసి న్యూస్ తో మాట్లాడుతూ చిన్నారి పై దాడి చేసిన చిరుత, బోనులో చిక్కిన చిరుత ఒక్కటేనా కాదా అనే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. చిరుత పులి కడుపులో మానవ మాంసమకు చెందిన ఆనవాళ్లు ఉన్నాయో? లేదా అనే దానిని తెలుసుకుంటాం. నిపుణులు చిన్నారి పై దాడి చేసిన చిరుత ఇదేనా కాదా అని నిజ నిర్ధారణ చేస్తారని తెలిపారు. ఆ తరువాత ఫారెస్ట్ ఆఫీసర్ల నిర్ణయం మేరకు బోనులో చిక్కిన చిరుతను జూలోనే ఉంచాలా? లేదా అడవిలో వదలాల అనే విషయాన్ని నిర్ణయిస్తామని తెలిపారు.
ఇక బోనులో చిక్కిన చిరుతపులి ఆడ చిరుత అని, దానికి నాలుగు ఏళ్లు ఉంటాయని వెల్లడించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి కూడా మాట్లాడుతూ చిన్నారి మరణించిన ప్రాంతంలోనే చిరుత పట్టుబడిందని అన్నారు. అయితే ఈ ప్రాంతంలో చిరుతల సంచారం ఇంకా ఉన్నట్టుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారని, చిరుతలను పట్టుకునే ప్రక్రియ కొనసాగుతుంది.
తిరుమల నడకదారిలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అటవీ శాఖ అధికారులు చెప్పేదాకా నిబంధనలు కొనసాగుతాయని అన్నారు. అంతేకాకుండా నడకదారిలో వచ్చే 15 ఏళ్లలోపు చిన్నారులను మధ్యాహ్నం 2 గంటల అనంతరం అనుమతించమని చెప్పారు. ఇక నడకమార్గంలో వచ్చే భక్తులు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని ధర్మారెడ్డి సూచించారు.