సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ సినిమా గురించి రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సినిమాటోగ్రాఫర్ ఈ సినిమా నుండి తప్పుకున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. కానీ దీనిపై మూవీ యూనిట్ స్పందించలేదు. తాజాగా ఈ మూవీలో మహేష్‌బాబు చేయబోయే పాత్ర గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
గుంటూరు కారం సినిమా ప్రారంభం అయినప్పటి నుండి ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ మూవీ పై ఎన్నో ప్రచారాలు వినిపిస్తున్నాయి. గుంటూరు కారం మూవీ షూటింగ్ కొనసాగుతుందా? ఆగిపోతుందా? అన్న విషయం సస్పెన్స్‌గా మారింది. ఈ మూవీ నుంచి హీరోయిన్ పూజాహెగ్డేతో పాటుగా సినిమాటోగ్రాఫర్ మధ్యలోనే మూవీ నుండి తప్పుకోవడం, షూటింగ్ కూడా పలుమార్లు వాయిదా పడుతుండడం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.
ఈ సినిమా స్టోరీకి సంబంధించి ప్రచారాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఐఎమ్‌డీబీ సైట్లో గుంటూరు కారం మూవీ స్టోరీకి సంబంధించిన సినాప్సిస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మహేష్‌బాబు గుంటూరు సిటీకి డాన్‌గా నటిస్తున్నట్లు ఆ సినాప్సిస్ లో పేర్కొన్నారు. గుంటూరు సిటీలో జరుగుతున్న అన్యాయాల పై, అక్రమాల పై పోరాటం చేస్తున్న ఒక జర్నలిస్ట్‌తో సూపర్ స్టార్ మహేష్‌బాబు ప్రేమలో పడతాడు.
ఆమె లక్ష్యాన్ని సాధించడం కోసం ఆ డాన్ ఎలా తోడుగా నిలుస్తాడు అనేది ఈ మూవీ స్టోరీ అని ఈ సినాప్పిస్లో కనిపిస్తోంది. త్రివిక్రమ్ మహేష్‌బాబు క్యారెక్టర్‌ను సర్ప్రైజ్ ట్విస్ట్‌తో డిజైన్ చేసినట్లుగా దానిలో చూపించారు. ఈ విషయం నిజమా? కాదా? అనేది అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు. ఇక ఈ మూవీలో జర్నలిస్ట్ గా మీనాక్షిచౌదరి, మహేష్‌బాబుకు మరదలి పాత్రలో శ్రీలీల నటిస్తున్నట్లు తెలుస్తోంది.

సమంత, విజయ్ దేవరకొండ కలిసి మహానటి మూవీలో కనిపించారు. కానీ హీరో హీరోయిన్లుగా కాదు. ఖుషిలో వీరిద్దరూ జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. ఇప్పటికే మూవీ యూనిట్ ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది. ఇటీవల నిర్వహించిన మ్యూజికల్ కాన్సర్ట్‌లో విజయ్, సమంతల డ్యాన్స్ పర్ఫామెన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ కార్యక్రమంలో సింగర్స్ పాటలు పాడి, ప్రేక్షకులను అలరించారు. అయితే మజిలీ మూవీ పాటకు సమంత ఎమోషనలైనట్లుగా తెలుస్తోంది. స్టేజీపై సింగర్ ప్రియతమా పాటను పాడుతున్న టైమ్ లో సమంత భావోద్వేగానికి లోనైంది. గత జ్ఞాపకాలు ఆ పాట ద్వారా గుర్తుకు రావడంతో వస్తున్న కన్నీళ్లు ఆపడానికి ప్రయత్నించిందని, దానికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా అయ్యింది. ఆ వీడియోను చూసిన సమంత ఫ్యాన్స్ ఆమె పరిస్థితి పై జాలి పడుతున్నారు. కొందరు కాలమే సమంత బాధను నయం చేస్తుందంటున్నారు.
మరికొందరు అభిమానులు సమంతను అలా చూస్తుంటే తమకు కూడా ఏడుపు వస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. నాగచైతన్యను సమంత మర్చిపోలేకపోతుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మజిలీ మూవీలో నాగచైతన్య, సమంత భార్యాభర్తలుగా నటించారు. వీరి పెళ్లి జరిగిన తరువాత కలిసి నటించిన మొదటి సినిమా కూడా ఇదే. ఈ చిత్రాన్ని శివ నిర్వాణ తెరకెక్కించాడు.
వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన మూవీ ‘గాండీవధారి అర్జున’. ఈ మూవీలో విలన్‌గా వినయ్ రాయ్ నటించారు. రోషిణి ప్రకాష్, అభినవ్ గోమతం, నరేన్, మనీష్ చౌదరి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం మిక్కీ జె మేయర్ అందించారు.
మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ ను ప్రారంభించింది. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ చిత్రం పై అంచనాలు పెరిగేలా చేశాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అది మాత్రమే కాకుండా సెన్సార్ సభ్యులు ఈ మూవీ పై పాజిటివ్‌గా స్పందించినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయని, ట్విస్టులు ఆకట్టుకుంటాయని సెన్సార్ బృందం చెప్పినట్లు సమాచారం. ఈ మూవీ తరువాత వరుణ్ తేజ్ తొలిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ఆ మూవీ ‘మట్కా’ అనే టైటిల్ తో రీసెంట్ గా లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కరుణ కుమార్ డైరెక్షన్ చేస్తుండగా, మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదే కాకుండా మరో మూవీలో కూడా వరుణ్ తేజ్ నటిస్తున్నారు. ఆ మూవీ పేరు ‘ఆపరేషన్ వాలెంటైన్’.
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్ ట్రాన్స్‌జెండర్‌గా నటించిన ఈ వెబ్ సిరీస్ 6 ఎపిసోడ్లుగా రూపొందింది.ఈ సిరీస్ కథలోకి వెళ్తే, గణేశ్ (కృతిక) ఒక పోలీసు ఆఫీసర్ కుమారుడు. అతనికి చిన్నప్పటి నుండే అమ్మాయిగా మారాలనె కోరిక ఉంటుంది. స్కూల్లో టీచర్ పెద్దగా అయిన తరువాత ఏమవుతావ్?’ అని అడిగితే అమ్మను అవుతానని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఈ విషయాన్ని గణేశ్ చెప్పకుండానే ఇంట్లో వారికి అర్థమవుతుంది. ఆ తరువాత గణేష్ తల్లి చనిపోతుంది.
అప్పుడు తండ్రి గణేష్ తో నీ నిర్ణయాన్ని మార్చుకుంటేనే ఇంట్లో ఉండమని లేదంటే బయటికి వెళ్ళమని చెబుతాడు. 15 సంవత్సరాల వయసులో గణేశ్ ఇంట్లోంచి బయటకు వచ్చి, సర్జరీ ద్వారా అమ్మాయిగా మారి, గౌరి (సుస్మితా సేన్) గా పేరు మార్చుకుంటాడు. అమ్మ కావలనే తన కోరికను గౌరి నెరవేర్చుకుందా? ట్రాన్స్జెండర్లకు గుర్తింపు తీసుకురావడానికి ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది? అనేది మిగతా కథ.
సుస్మితా సేన్ నటన ఇలాంటి క్యారెక్టర్ ను అంగీకరించడమే సాహసం అనుకుంటే ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయి నటించారు. అనేది. ఆమె ట్రాన్స్‌జెండర్ పాత్రలో జీవించింది. గణేశ్ పాత్రలో కృతిక డియో, తండ్రి పాత్రలో నందు యాదవ్, మిగతా నటీనటులు కూడ బాగా నటించారు. పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. విజువల్స్, రవి జాదవ్ టేకింగ్ బాగుంది.
2001లో రిలీజ్ ‘గదర్’ మూవీ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా నటించారు. పాకిస్తాన్‌లోని పొలిటికల్ ముస్లిం ఫ్యామిలీకి చెందిన సకీనా (అమీషా పటేల్) తో అమ్మాయితో సిక్కు అయిన తారా సింగ్ (సన్నీ డియోల్) ల ప్రేమకథ చుట్టూ ఈ మూవీ కథ సాగుతుంది. ఈ మూవీకి 22 ఏళ్ల తరువాత సీక్వెల్ గా వచ్చిన ‘గదర్ 2’ కు అనిల్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కూడా సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా నటించారు.
గదర్ 2 కథ విషయానికి వస్తే, ఇది తండ్రికొడుకుల చుట్టూ సాగే కథ. తారా సింగ్ (సన్నీ డియోల్), సకీనా (అమీషా పటేల్) సంతోషంగా జీవిస్తుంటారు. వీరి కుమారుడు చరణ్‌జీత్ సింగ్ (ఉత్కర్ష్ శర్మ) పెద్దవాడవుతాడు. అదే సమయంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభం అవుతుంది. పాకిస్తానీ ఆర్మీతో పోరాడుతుండగా, సరిహద్దుల్లో చిక్కుకున్న ఆర్మీ యూనిట్‌కు సాయం చేయాల్సిందిగా ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ దేవేంద్ర రావత్ (గౌరవ్ చోప్రా) తారా సింగ్ ను అడుగుతాడు.
అందుకు అంగీకరించిన తారా సింగ్ ఇండియన్ఆర్మీ యూనిట్‌కు శ్యామ్ చేయడమే కాకుండా పాకిస్థాన్ సైనికులతో పోరాటం చేస్తాడు. ఈక్రమంలో పాకిస్తాన్ ఆర్మీ తారాసింగ్ తో పాటుగా కొంతమంది ఇండియన్ సోల్జర్స్, ట్రక్ డ్రైవర్లను కూడా పట్టుకుని పాక్ జైలులో బంధిస్తారు. దీంతో సకీనా, చరణ్‌జీత్ సింగ్ చాలా బాధపడుతారు. తల్లి బాధను చూసి భరించలేని చరణ్‌జీత్ తండ్రిని భారత్ కు తీసుకురావడానికి సిద్ధపడతాడు. అతను ఎలా పాకిస్థాన్ వెళ్ళాడు? ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? తండ్రిని కాపాడాడా? అనేది మిగలిన కథ.
హీరో సన్నీ డియోల్ తారా సింగ్ గా అద్భుతంగా నటించాడు. అమీషా పటేల్ పాత్ర నిడివి తక్కువగా ఉంది. ఉత్కర్ష్ శర్మ నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సిమ్రత్ కౌర్ అందంగా కనిపించింది. ముస్తాక్ ఖాన్, ఎహసాన్ ఖాన్, ముస్తాక్ కాక్ పాత్రల పరిధి మేరకు నటించారు.
ఆదిపురుష్ సినిమా జూన్ 16న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడియెన్స్ ను ఆకట్టుకోలేక పోయింది. ఆడియెన్స్ తో పాటు, ప్రభాస్ ఫ్యాన్స్, సినీ, రాజకీయ ప్రముఖులు సైతం దర్శకుడు ఓం రౌత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలు, వివాదాలు, కోర్టులో కేసులు వేసే వరకు వెళ్ళింది. రామాయణంను మార్చి చూపించారని, రావణాసురుడి క్యారెక్టర్ ను తప్పుగా చూపించారని, హనుమంతుడితో మాస డైలాగ్స్ చెప్పించారని, పేర్లు మార్చారని ఇలా ఎన్నోవివాదాలు వచ్చాయి.
తాజాగా కోరాలో “ఆది పురుష్ సినిమాలో లక్ష్మణుడిపేరు శేషు అని పెట్టారు. దీని గురించి వివరించగలరా?” అనే ప్రశ్నను అడుగగా
ఆ పామే లక్ష్మణునిగా జన్మించింది. అందుకే ఈ సినిమాలో లక్ష్మణుని పూర్వ జన్మ పేరుతో శేషు అని పిలిచాడు రాముడు. ఇంకా మహావిష్ణువు యొక్క శంకు, చక్రాలు – భరత, శతృఘ్నులుగా, ఆయన సతీదేవి అయినటువంటి మహాలక్ష్మి దేవి సీతగా జన్మించారు” అని తెలిపారు.
జైలర్ మూవీ ఇప్పటివరకు 4 వందల కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్టు తెలుస్తోంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవడంతో ఈ మూవీలోని పలువురు నటులకు గుర్తింపు వచ్చింది. ఇంతవరకు వారు పలు సినిమాలలో నటించినా రాని పాపులారిటీ ఈ మూవీతో వచ్చింది. ఈ మూవీలోని నటులకు సంబంధించిన వివరాలను నెటిజెన్లు వెతికి మరి, వారి గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వారి వివరాలు తెలిసిన తరువాత ఆశ్చర్యపోతూ, కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే జైలర్ మూవీలో వేసుకున్న రజనీకాంత్ జైలర్ లో జైలర్‌లో తమన్నా లవర్ డైరెక్టర్ బాగున్నార బాలుగా నటించిన యాక్టర్ గురించి తెలిసి షాక్ అవుతున్నారు. ఆ నటుడి పేరు సునీల్ రెడ్డి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ గత చిత్రాలలో కూడా సునీల్ రెడ్డి నటించాడు. డాక్టర్ మూవీలో మహాలి అనే పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత విజయయ్ దళపతి నటించిన బీస్ట్ మూవీలో కూడా నటించారు.
ఈ సునీల్ రెడ్డి మరెవరో కాదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ కోదండరామిరెడ్డి కుమారుడు. వైభవ్ రెడ్డికి అన్నయ్య. నటుడిగా మారకముందు సునీల్ రెడ్డి తండ్రి కోదండరామి రెడ్డి డైరక్షన్ చేసిన గొడవ, కాస్కో లాంటి తెలుగు సినిమాలకు సమర్పకుడిగా పనిచేశాడు.
జీవితంలో చాలామందికి ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకుంటారు. కొందరు ప్రేమిస్తారు. కానీ వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళకుండానే ఆగిపోతుంది. ప్రేమలో విఫలం అయినవారు చివరికి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారు. కానీ ప్రేమను మర్చిపోలేరు. అయితే అసలు ఒక వ్యక్తికి ప్రేమ వివాహం జరుగుతుందా లేదా అనే విషయాన్ని తమ అరచేతిలో ఉండే గుర్తులను బట్టి తెలుసుకోవచ్చని హస్తసాముద్రిక శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అరచేతిలో చూపుడు వేలు క్రింద ఉన్న స్థానాన్ని గురు స్థానం అని అంటారు.ఈ గురు స్థానం మీద క్రాస్ మార్క్ లాంటి గుర్తు ఉంటే అది ఖచ్చితంగా ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది. అలాగే మరొక గుర్తు అరచేతిలోని శుక్ర స్థానం మీద ఉంటుంది. అరచేతిలో బొటన వేలు క్రింద ఉన్న స్థానాన్ని శుక్ర స్థానం అని పిలుస్తారు. ఈ శుక్ర స్థానం మీద ఒక చతురస్రం గుర్తు ఉన్నట్లయితే ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది.
అరచేతిలోని చిటికెన వేలు క్రింద ఉన్న స్థానాన్ని బుధ స్థానం అంటారు. ఈ బుధ స్థానం చివర నుండి అంటే చిటికెన వేలు చివర, అరచ్చటి చివర నుండి అడ్డంగా వ్యాపించి, రవిస్తానం వరకు కూడా వ్యాపించి ఉన్నా, అది ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది. అదే విధంగా అరచేతిలో బుద్ధి రేఖ మరియు ఆయుష్హు రేఖను కలుపుతూ ఒక నిలువు గీత ఉంటే అది కూడా ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది. పైన చెప్పిన ఈ నాలుగు గుర్తులలో ఏ రెండు గుర్తులు మీ అరచేతిలో ఉన్నా, వారికి ఖచ్చితంగా ప్రేమ వివాహం జరుగుతుందని హస్త రేఖా సాముద్రిక శాస్త్రం చెబుతోంది.
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ భోళా శంకర్. ఈ సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ మూవీలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటించింది. సుశాంత్ కీలక పాత్రలో నటించాడు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీకి వచ్చిన టాక్, కలెక్షన్స్ ను చూసి అందరు షాక్ అవుతున్నారు. చిరంజీవి మూవీకి ఇలాంటి కండిషన్ ఏమిటని మెగా ఫ్యాన్స్ బాధపడుతున్నారు.
ఈ చిత్రానికి మెహర్ రమేష్ డైరెక్టర్ అని ప్రకటించినపుడే ఆడియెన్స్ తో పాటు, మెగా ఫ్యాన్స్ మూవీ పై ఆశలు వదిలేసుకున్నారు. అయితే టీజర్, ట్రైలర్ మరియు మూవీ ప్రమోషన్స్‌లో చిరంజీవి, డైరెక్టర్, నిర్మాత చెప్పిన మాటలకు ఈ మూవీ పై కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. పాటలు అంతగా ఆకట్టుకోలేదు. మహతి స్వరసాగర్ ఇంతకు ముందు చేసిన పాటలు హిట్ అయ్యాయి. దాంతో భోళా శంకర్ మూవీకి మంచి పాటలు ఇస్తాడనుకున్నారు.
ఈ మూవీలోనీ ఏ పాట కూడా చార్ట్ బస్టర్ అవలేదు. యూట్యూబ్‌లో కూడా ట్రెండ్ కాలేదు. నేపథ్య సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేదు. అయితే మహతి స్వర సాగర్ తాజాగా ఈ విషయం పై స్పందించాడని తెలుస్తోంది. ఈ మూవీకి తాను ఇచ్చిన పాటలు, కంపోజిషన్ పట్ల అసంతృప్తితో ఉన్నానని, మెగాస్టార్ రేంజ్ కు తగ్గట్టుగా ఇవ్వలేకపోయానని అన్నట్టుగా సమాచారం. ఈ వార్త తెలిసిన నెటిజెన్లు, అంతా అయ్యాక అనుకుంటే ఏం వస్తుందని కామెంట్లు చేస్తున్నారు.
జాఫర్ సాదిక్ తమిళనాడులో ఈరోడ్‌లో 1995 జూలై 4 న జన్మించాడు. ప్రస్తుతం కోలీవుడ్ మరియు టాలీవుడ్ సినిమాలలో నటిస్తున్నజాఫర్ నటుడు మాత్రమే కాదు. అతను కొరియోగ్రాఫర్ మరియు డాన్సర్. కోలీవుడ్ లో పాపులర్ టెలివిజన్ డ్యాన్స్ షో ‘ఉంగలిల్ యార్ ప్రభుదేవా’ రెండవ సీజన్లో 2వ స్థానం పొందిన తర్వాత జాఫర్ పాపులర్ అయ్యాడు. ఆ తరువాత అతను సొంతంగా ‘లిఫ్టోదర్స్’ అనే పేరుతో డ్యాన్స్ స్టూడియోను ప్రారంభించాడు.
జాఫర్ అనేక ఈవెంట్లలో స్టేజ్ షోస్ ఇచ్చాడు. అలా అతను 500కి పైగా ప్రదర్శనలు ఇచ్చాడు. 2018లో ఫిబ్రవరి 13న జరిగిన TedxGCT ఈవెంట్లో జాఫర్ సాదిక్ చేసిన డ్యాన్స్ తో మరింత పాపులారిటీ వచ్చింది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తూ వేలమంది ఫాలోవర్స్ ను సంపాదించాడు. ప్రస్తుతం అతని ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 506 K. జాఫర్ సాదిక్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ సినిమా సిరీస్ ‘పావ కాదైగల్’లో నారికుట్టిగా నటించాడు.
ఆ తరువాత కోలీవుడ్ లో లోకేష్ కనకారాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ మూవీలో మొదటిసారిగా నటించాడు. గ్యాంగ్ లో మెంబర్ గా నటించినప్పటికీ అతని పాత్రకి గుర్తింపు వచ్చింది. ఈ మూవీ తరువాత అతనికి వరుస అవకాశాలు వస్తున్నాయి. అలా జైలర్, విజయ్ దళపతి లియో, షారుక్ ఖాన్ జవాన్ సినిమాలలో నటిస్తున్నాడు.