మీ అరచేతి మీద చేప సింబల్ ఉందా..? దాని అర్ధం వింటే షాక్ అవ్వాల్సిందే..!

మీ అరచేతి మీద చేప సింబల్ ఉందా..? దాని అర్ధం వింటే షాక్ అవ్వాల్సిందే..!

by kavitha

Ads

హస్తసాముద్రిక జ్యోతిషశాస్త్రం మనిషి అరచేతిలోని రేఖలు ఆ వూయక్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుపుతుంది. ఒక వ్యక్తి లైఫ్ లో విజయం సాధించి, కోటీశ్వరుడు కావాలంటే కృషితో పాటుగా అదృష్టం కావలసివస్తుంది. కానీ అదే సమయంలో కొందరికి పుట్టుకతోనే అదృష్టాన్ని వస్తుంది. అలాంటివారు ఏది అడగకుండానే అన్నింటినీ పొందుతారు.

Video Advertisement

అరచేతిలో ఉండే కొన్ని గుర్తులు ఆ వ్యక్తులను ధనవంతులుగా చేస్తుందని హస్తసాముద్రిక నిపుణులు చెబుతున్నారు. ధనవంతులు మాత్రమే కాకుండా జీవితంలో మరియు కెరీర్ లో కూడా మంచి విజయాలను సాధిస్తారట. మరి ధనవంతులుగా మార్చే ఆ గుర్తు గురించి ఇప్పుడు చూద్దాం..
మనిషి అరచేతిలోని రేఖలు అతని భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని చాలామంది నమ్ముతుంటారు. హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం చేతిలో ఉండే ప్రతి రేఖకు ఒక ప్రాముఖ్యత ఉంది. అరచేతిలో ఉండే రక రకాల గుర్తులు, రేఖలు  ఫ్యూచర్ ను ప్రభావితం చేస్తాయి. కొంతమంది అరచేతిలో చేప గుర్తు ఉంటుంది. దీనిని మీనరేఖ అని కూడా పిలుస్తారు. ఇక హస్తసాముద్రికంలో చేప గుర్తు ప్రముఖమైనదని చెబుతారు. మీనరేఖ అనేది చాలా అద్బుతమైన రేఖ.  మరి అరచేతిలో ఉండే చేపగుర్తు వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మీనరేఖ అరచేతిలో ఏ ప్రదేశంలో ఉన్నా, మంచి యోగదాయకంగా ఉంటుంది. ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశం యొక్క శుభ ఫలితాలు వస్తాయి. చంద్ర స్థానంలో మీనరేఖ ఉంటే మంచి ప్రేమకలవారు అవుతారు. శుక్రస్థానంలో మీనరేఖ ఉన్నట్లయితే మంచి భార్య వస్తుంది. గురు స్థానంలో మీనరేఖ ఉన్నట్లయితే మంచి విద్య లభిస్తుంది. అలాగే కుజ స్థానంలో మీనరేఖ ఉంటే మంచి యోగదాయకమైన ఉద్యోగం వస్తుంది.
బుధ స్థానంలో మీనరేఖ ఉంటే వ్యాపారంలో బాగుటుంది. ఈ విధంగా మీనరేఖ ఏ స్థానంలో ఉన్నప్పటికీ మంచి ఫలితాన్ని ఇస్తుంది. వీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఏ విషయానికి లొంగిపోరు, ఈ గుర్తు అరచేతిలో ఉన్నవారు అన్ని విషయాలలో విజయం సాధిస్తారని హస్తసాముద్రిక నిపుణులు చెబుతున్నారు.

Also Read: మీ అరచేతి మీద M సింబల్ ఉందా..? దాని అర్ధం వింటే షాక్ అవ్వాల్సిందే..!


End of Article

You may also like