“గుంటూరు కారం” మూవీలో డాన్ గా మ‌హేష్‌బాబు..?

“గుంటూరు కారం” మూవీలో డాన్ గా మ‌హేష్‌బాబు..?

by kavitha

Ads

సూపర్ స్టార్ మ‌హేష్‌బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. ఈ  సినిమాలో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ సినిమా గురించి రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Video Advertisement

మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సినిమాటోగ్రాఫర్ ఈ సినిమా నుండి తప్పుకున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. కానీ దీనిపై మూవీ యూనిట్ స్పందించలేదు. తాజాగా ఈ మూవీలో మ‌హేష్‌బాబు చేయబోయే పాత్ర‌ గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
guntur-karam-movie గుంటూరు కారం సినిమా ప్రారంభం అయినప్పటి నుండి ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ మూవీ పై ఎన్నో ప్రచారాలు వినిపిస్తున్నాయి. గుంటూరు కారం మూవీ షూటింగ్ కొన‌సాగుతుందా? ఆగిపోతుందా? అన్న విషయం స‌స్పెన్స్‌గా మారింది. ఈ మూవీ నుంచి హీరోయిన్ పూజాహెగ్డేతో పాటుగా సినిమాటోగ్రాఫ‌ర్ మధ్యలోనే మూవీ నుండి తప్పుకోవడం, షూటింగ్ కూడా ప‌లుమార్లు వాయిదా పడుతుండడం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.
ఈ సినిమా స్టోరీకి సంబంధించి ప్ర‌చారాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఐఎమ్‌డీబీ సైట్‌లో గుంటూరు కారం మూవీ స్టోరీకి సంబంధించిన‌ సినాప్సిస్ సోషల్ మీడియాలో వైర‌ల్‌ అవుతోంది. ఈ చిత్రంలో మ‌హేష్‌బాబు గుంటూరు సిటీకి డాన్‌గా నటిస్తున్నట్లు ఆ సినాప్సిస్ లో పేర్కొన్నారు. గుంటూరు సిటీలో జరుగుతున్న అన్యాయాల పై, అక్ర‌మాల‌ పై పోరాటం చేస్తున్న ఒక జ‌ర్న‌లిస్ట్‌తో సూపర్ స్టార్ మ‌హేష్‌బాబు ప్రేమ‌లో ప‌డ‌తాడు.
ఆమె ల‌క్ష్యాన్ని సాధించడం కోసం ఆ డాన్ ఎలా తోడుగా నిలుస్తాడు అనేది ఈ మూవీ స్టోరీ అని ఈ సినాప్పిస్‌లో క‌నిపిస్తోంది. త్రివిక్ర‌మ్ మ‌హేష్‌బాబు క్యారెక్ట‌ర్‌ను స‌ర్‌ప్రైజ్ ట్విస్ట్‌తో డిజైన్ చేసిన‌ట్లుగా దానిలో చూపించారు. ఈ విషయం నిజమా? కాదా? అనేది అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు. ఇక ఈ మూవీలో జ‌ర్న‌లిస్ట్‌ గా మీనాక్షిచౌద‌రి, మ‌హేష్‌బాబుకు మ‌ర‌ద‌లి పాత్రలో శ్రీలీల నటిస్తున్నట్లు తెలుస్తోంది.


End of Article

You may also like