మీ అరచేతిలో ఈ గుర్తులు ఉన్నాయా..? అయితే మీకు కచ్చితంగా ప్రేమ వివాహమే..! ఏవి ఏంటంటే..!

మీ అరచేతిలో ఈ గుర్తులు ఉన్నాయా..? అయితే మీకు కచ్చితంగా ప్రేమ వివాహమే..! ఏవి ఏంటంటే..!

by kavitha

Ads

హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం అరచేతిలోని రేఖలను, గుర్తుల ఆధారంగా ఒక వ్యక్తి  జీవితంలో విషయాలను అంచనా వేసి చెప్తుంటారు.  సాధారణంగా కెరీర్, ఉద్యోగం, వ్యాపారం వంటి గురించి  తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు.

Video Advertisement

అయితే ఒక వ్యక్తి ప్రేమ వివాహం చేసుకుంటాడా? లేదా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారా అనే విషయాన్ని కూడా వారి అరచేతుల పై ఉండే రేఖలు, గుర్తుల ఆధారంగా లెక్కించవచ్చు అని హస్త సముద్రికా నిపుణులు చెబుతున్నారు. అయితే అరచేతిలో ఏ గుర్తులు ఉంటే ప్రేమ వివాహం చేసుకుంటారో ఇప్పుడు చూద్దాం..
జీవితంలో చాలామందికి  ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకుంటారు. కొందరు ప్రేమిస్తారు. కానీ వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళకుండానే ఆగిపోతుంది. ప్రేమలో విఫలం అయినవారు చివరికి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారు. కానీ ప్రేమను మర్చిపోలేరు. అయితే అసలు ఒక వ్యక్తికి ప్రేమ వివాహం జరుగుతుందా లేదా అనే విషయాన్ని తమ అరచేతిలో ఉండే గుర్తులను బట్టి తెలుసుకోవచ్చని హస్తసాముద్రిక శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అరచేతిలో చూపుడు వేలు క్రింద ఉన్న స్థానాన్ని గురు స్థానం అని అంటారు.ఈ గురు స్థానం మీద క్రాస్ మార్క్ లాంటి గుర్తు ఉంటే అది ఖచ్చితంగా ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది. అలాగే మరొక గుర్తు అరచేతిలోని శుక్ర స్థానం మీద ఉంటుంది. అరచేతిలో బొటన వేలు క్రింద ఉన్న స్థానాన్ని శుక్ర స్థానం అని పిలుస్తారు. ఈ శుక్ర స్థానం మీద ఒక చతురస్రం గుర్తు ఉన్నట్లయితే ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది.
అరచేతిలోని చిటికెన వేలు క్రింద ఉన్న స్థానాన్ని బుధ స్థానం అంటారు. ఈ బుధ స్థానం చివర నుండి అంటే చిటికెన వేలు చివర, అరచ్చటి చివర నుండి అడ్డంగా వ్యాపించి, రవిస్తానం వరకు కూడా వ్యాపించి ఉన్నా, అది ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది. అదే విధంగా అరచేతిలో బుద్ధి రేఖ మరియు ఆయుష్హు రేఖను కలుపుతూ ఒక నిలువు గీత ఉంటే అది కూడా ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది. పైన చెప్పిన ఈ నాలుగు గుర్తులలో ఏ రెండు గుర్తులు మీ అరచేతిలో ఉన్నా, వారికి ఖచ్చితంగా ప్రేమ వివాహం జరుగుతుందని హస్త రేఖా సాముద్రిక శాస్త్రం చెబుతోంది.

Also Read: మీ అరచేతి మీద చేప సింబల్ ఉందా..? దాని అర్ధం వింటే షాక్ అవ్వాల్సిందే..!


End of Article

You may also like