సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ బిజినెస్ మెన్. ఇటీవలే మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రీరిలీజ్ అయ్యి, కలెక్షన్స్ లో రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే.
మహేష్ బాబు కెరీర్ లోనే బిజినెస్ మెన్ స్టైలిష్ మూవీ అని చెప్పవచ్చు. సూర్య అంటే ఒక పేరు కాదు ఒక బ్రాండ్ అని ఈ మూవీలో మహేష్ బాబు చెప్పిన డైలాగులు, యాక్షన్ సీన్స్ మూవీకి హైలైట్ గా నిలిచాయి. అయితే ఇది ఫిక్షనల్ స్టోరీ కాదు. ఈ మూవీ ఒక వ్యక్తో రియల్ లైఫ్ ఆధారంగా తీసిన మూవీ ఇది. మరి ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు చూద్దాం..
మహేష్ బాబు ఈ చిత్రంలో సరికొత్తగా, గ్యాంగస్టర్ గా కనిపించారు. ఈ సినిమాలో సాధారణ వ్యక్తి, ముంబైకి వెళ్ళి సూర్య భాయ్ గా ఎదుగుతాడు. ఈ క్యారెక్టర్ లో మహేష్ బాబు నటనకు ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ కూడా ఫిదా అయ్యారు. ఈ మూవీలో హీరోయిన్ గా కాజల్ నటించింది. థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. మహేష్ బాబు కెరీర్ లో ఈ చిత్రం మర్చిపోలేని మూవీ అని చెప్పవచ్చు. మూవీ అంతా ముంబై నేపథ్యంలోనే సాగుతుంది.
అయితే బిజినెస్ మెన్ మూవీ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ కథ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిందని తెలుస్తోంది. అలా ముంబైకి వెళ్లి గ్యాంగస్టర్ గా ఎదిగిన వ్యక్తి పేరు సతువాచారి వరదరాజన్ ముదలియార్. ఆయన 1960 లో సాధారణ వ్యక్తిగా ముంబైకి వెళ్లి, ఒక ముంబై డాన్ వరదా బాయ్ గా ఎదిగారట. సతువాచారి 1926 లో అక్టోబర్ 9న జన్మించారు.
వరదా బాయ్ ని వర్ధ అని కూడా అనేవారంట. అంతేకాకుండా ఇండియన్ క్రైమ్ బాస్ అని కూడా పిలిచేవారట. వరదా బాయ్ 1988లో జనవరి 2న మరణించారు. వరదా బాయ్ నిజ జీవిత కథ ఆధారంగానే డైరెక్టర్ పూరి జగన్నాధ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో బిజినెస్ మెన్ మూవీని తీశారు. కమల్ హాసన్ నటించిన నాయకుడు సినిమా కూడా వరదా బాయ్ ని కథతో తెరకెక్కింది.
Also Read: మెహర్ రమేష్ సినిమా గురించి… పూరి జగన్నాధ్ ఆ సినిమాలో అప్పుడే చెప్పారా..?

చిరుత దాడిలో చిన్నారి చనిపోవడం ఇటు ప్రజల్లో, అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తిరుమల నడకదారిలో చిరుతలు, లేదా ఇతర క్రూరమృగాలు ఎందుకు వస్తున్నాయనే అంశం తెరపైకి వచ్చింది.
తిరుమల కొండల పై అకేసియా చెట్లు పెంచడం వల్ల ఈ సమస్య వచ్చిందని భూమన్ తెలిపారు. గంటా మండపం, నామాల గవి వద్ద 225 ఎకరాలు ఉండేదని, అక్కడ 1985లో చెట్లు లేవని, టీటీడీ అకేసియా చెట్లను అక్కడ నాటింది. ఈ చెట్ల కారణంగా అక్కడ పెరిగే ఈత, శ్రీగంధం వంటి మిగతా చెట్లు ఎదగవని, ఇతర మొక్కలు కూడా బతకవని చెప్పారు. చెట్లు పెరిగినప్పటికీ, వాటికి కాయలు కాయకపోవడంతో అక్కడ ఆహారం లభించక ఇతర జంతువులు వెళ్లిపోయాయని అన్నారు. ఆ ప్రాంతంలో చిరుతలు కొన్ని స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయని చెప్పారు.
అయితే రీసెంట్ గా సుమారు ముప్పై ఎకరాల్లో ఉన్న అకేసియా చెట్లను కొట్టేశారు. అప్పటి దాకా ఆ చెట్ల నీడలో ఉండే చిరుతలు మనుషులకు సమీపంలో వాటి స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాయని భూమన్ చెప్పుకొచ్చారు. కానీ టీటీడీ డీఎఫ్‌వో శ్రీనివాసులు బీబీసీతో మాట్లాడుతూ అకేసియా చెట్లను కొట్టేసింది నిజమేనని, అయితే వాటిని కొట్టేయడం కారణంగా చిరుత పులులు నడకదారి వైపు వస్తున్నాయని చెప్పడంలో వాస్తవం లేదని చెప్పారు.
యాంకర్ మరియు నటి అనసూయ ఏడుస్తూ ఇన్ స్టాగ్రామ్ లో చిన్న వీడియోతో పాటుగా సుదీర్ఘమైన నోట్ కూడా షేర్ చేసి ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేసింది. ఆమె సుధీర్ఘమైన పోస్టును చూస్తే సోషల్ మీడియాలో తన పై వస్తున్న ట్రోలింగ్ కి బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది.
అనసూయ పెట్టిన పోస్టు సారాంశం, నాకు తెలిసినంతవరకు సోషల్ మీడియాను సమాచారం, కమ్యూనికేషన్ కోసం మొదట్లో వాడాం. ఆ తరువాత ప్రపంచంలోని జీవన శైలి, డిఫరెంట్ సంస్కృతి, సంప్రదాయల గురించి, నాలెడ్జ్ కోసం ఉపయోగించేవాళ్ళం. ఇక్కడికి ఒకరికొకరు సపోర్ట్ గా నిలవాలనే వస్తాం. ఆనందం, బాధ వంటి వాటిని పంచుకోవడానికి సోషల్ మీడియా ఉంటాం. నే సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రతి జ్ఞాపకం, ఫోటోలు, డాన్సులు, స్ట్రాంగ్ కౌంటర్లు, కంబ్యాక్ లు అన్ని నా జీవితంలో భాగమే.
గత ఏడాది ‘పోకిరి’ తో మొదలైన రీరిలీజ్ ట్రెండ్ విజయవంతంగా కొనసాగుతోంది. స్టార్ హీరోల పుట్టిన రోజు సందర్భంగా వారి కెరీర్ లో హిట్ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను రీరిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ హిట్ సినిమాలు రీరిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. ఎన్టీఆర్ నటించిన ‘సింహాద్రి’ కూడా రీరిలీజ్ లో మంచి వసూళ్లను సాధించింది.
అయితే గతంలో నిరాశపరిచిన రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ మూవీ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేయడంతో రీరిలీజ్ చేశారు. అప్పుడు డిజాస్టర్ అయిన ఈ మూవీ ఇప్పుడు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ విషయం ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆ తరువాత యావరేజ్ గా నిలిచిన చిన్న సినిమా ‘ఈనగరానికి ఏమైంది’ రీరిలీజ్ లో మంచి కలెక్షన్స్ సాధించి, పెద్ద సినిమాల లిస్ట్ లో నిలిచింది.
తాజాగా రీరిలీజ్ అయిన యోగికి కూడా అలాంటి రెస్పాన్స్ రావడంతో వరుసగా కొన్ని ప్లాప్ సినిమాలు రీరిలీజ్ సిద్ధం అయ్యాయి. అయితే స్టార్ హీరోలందరికి కాలంతో పని లేకుండా ఎప్పుడు రిలీజ్ అయినా ఫ్లాపే అనిపించే చిత్రాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిని టచ్ చేయకపోవడమే బెటర్ అని అంటున్నారు. రాఖీ, ఒక్క మగాడు, లయన్ సినిమాలను త్వరలో రీరిలీజ్ కాబోతున్నాయి. అయితే వీటి పై సోషల్ మీడియాలో మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
ప్రతిరోజూ రాకపోకలు సాగించే నేషనల్, ఇంటర్నేషనల్ విమానాలతో నిత్యం రద్దీగా ఉండే విమానాశ్రయం చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల పక్షులు ఎక్కువగా సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో విశాఖ ఎయిర్పోర్ట్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మల్లికార్జున ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం నాడు కలెక్టరేట్ లో జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మతో మరియు సివిల్ అడ్మినిస్ట్రేషన్, పోర్ట్ ట్రస్ట్, జీవీఎంసీ,ఇండియన్ నేవీ, ఎయిర్ పోర్ట్ అథారిటీ యొక్క ప్రతినిధులతో మీటింగ్ నిర్వహించారు.
దీనిలో రన్‌వేలో నీటి నిల్వ, విమానాశ్రయం పరిసరాల్లో చెత్త డంపింగ్, పక్షుల వల్ల జరిగే ప్రమాదాలు వంటి అంశాలపై చర్చలు జరిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ ఉన్న ప్రాంతం జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో ఉండడం వల్ల అధికంగా వ్యర్థాలు అక్కడ చేరుతున్నాయని అన్నారు. మేహాద్రి గెడ్డ కాలువలో మేకల, కోళ్ల మాంసపు వ్యర్థాలు ఎక్కువగా వేస్తున్నారని, అందువల్ల ఆ పరిసరాలు పక్షులు, కుక్కలకు ఆవాసాలుగా మారుతున్నాయని అన్నారు.
ఈ కారణంగా పక్షుల సంఖ్య పెరగడంతో విమానాల రాక, పోకలకు అవి ఆటంకం కలిగిస్తున్నాయని తెలిపారు. అందువల్ల ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మీట్ షాప్ లను తొలగించాలని, పారిశుధ్య చర్యలను తీసుకోవాలని కలెక్టర్ జీవీఎంసీ ఆఫీసర్లను ఆదేశించారు. అలాగే ఈ విషయం పై జనాలకు కూడా అవగాహన కల్పించాలని చెప్పారు. వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించాలన్నారు. భారీ వర్షాల సమయంలో నీరు ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళకుండా కావాల్సిన నిర్మాణాలు, పూడికతీత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
తమిళ హీరో శివకార్తికేయన్ కు టాలీవుడ్ లో తన మార్కెట్ ను పెంచుకుంటున్నాడు. తెలుగు దర్శకుడు అనుదీప్ తెరకెక్కించిన ‘ప్రిన్స్’ అనే తెలుగు సినిమాను చేశాడు. అయితే ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. కానీ శివకార్తికేయన్ ముందు సినిమాల కన్నా మంచి ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఇటీవల శివకార్తికేయన్ నటించిన ‘మహావీరుడు’ మూవీ తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల అయ్యింది.
ఈ మూవీ మొదటి షోతోనే యావరేజ్ టాక్ తెచ్చుకుంది. మూవీ కాన్సెప్ట్ బాగున్నా, ఎగ్జిక్యూషన్ యావరేజ్ గా ఉందనే టాక్ వచ్చింది. శివకార్తికేయన్ మార్క్ కామెడితో రూపొందింది. అయితే ఈ మూవీ రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఇక ఈ మధ్య ఓటీటీలో సినిమాలు చూస్తూ, అందులో ఉండే పొరపాట్లను గమనించి, మీమ్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయడం, అవి కాస్త వైరల్ అవడం సాధారణం అయిపోయింది.
ఓటీటీలో ఈ మూవీని చూసి, ఇందులోని ఒక పొరపాటును గమనంచిన ఒక నెటిజెన్, హర్ష్ మీమర్ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో దానికి సంబంధించిన వీడియోకి ‘ఎడిటింగ్ చూసుకోవాలి కదా’ అంటూ షేర్ చేశాడు. ఆ వీడియోలో బోర్డు పై ముందు తమిళంలో మా భూమి అని, వెంటనే తెలుగులోకి మారుతుంది. దీనిపై నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించగా, కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటించింది. సుశాంత్ కీలక పాత్రలో నటించాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 11న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకున్న తీవ్రమైన ట్రోలింగ్ కు గురి అయ్యింది. ఈ మూవీలోని సీన్స్ ను షేర్ చేస్తూ ఓ రేంజ్ లో నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మెహర్ రమేష్ సినిమాలకు ఇతర విషయాలతో ఉన్న కనెక్షన్స్ వెతికి పట్టుకొని మరి నెటిజెన్లు వైరల్ చేస్తున్నారు. మొన్నటి మొన్న మెహర్ రమేష్ సినిమాలు ప్లాప్ అయిన ఏడాది జరిగిన ప్రపంచ కప్ ఇండియకే వచ్చిందనే వార్త వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ‘నేనింతే’ సినిమాలో మెహర్ రమేష్ తీసిన షాడో మూవీ గురించి ముందే చెప్పారనే విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
నేనింతే మూవీలో బ్రహ్మానందం తీసిన మూవీ పేరు షాడో. ఆ మూవీలోని పోస్టర్ పై ఉన్న షాడో ఫాంట్, మెహర్ రమేష్ తీసిన మూవీ షాడో ఫాంట్ ఒకేలా ఉంటాయి. నేనింతే మూవీ 2008 లో రిలీజ్ అయ్యింది. ఇక మెహర్ రమేష్ తీసిన షాడో మూవీ 2013 లో రిలీజ్ అయ్యింది. దాంతో మెహర్ రమేష్ షాడో మూవీ గురించి పూరి జగన్నాధ్ నేనింతే సినిమాలో ముందే చెప్పారా అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
జైలర్ మూవీని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించాడు. ఈ మూవీలో ప్రధాన పాత్రలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించగా, ఆయన భార్యగా రమ్యకృష్ణ, కొడుకుగా యంగ్ హీరో వసంత్ రవి, కోడలిగా మిర్నా మేనన్ నటించారు. మనవడిగా నటించిన బాలనటుడు ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు. దాంతో నెటిజెన్లు ఆ అబ్బాయి ఎవరా అని నెట్టింట్లో వెతుకుతున్నారు.
ఆ బాలనటుడి పేరు రిత్విక్ అతన్ని రీతు రాక్స్ అని కూడా పిలుస్తారు. జైలర్ మూవీ కన్నా మూడు పలు సినిమాలలో రిత్విక్ నటించాడు. అతని మొదటి సినిమా O2 (ఆక్సిజన్). ఈ మూవీలో నయనతార కుమారుడి పాత్రలో నటించాడు. ఆ తరువాత కార్తీ హీరోగా నటించిన సర్దార్ మూవీలో లైలా కొడుకుగా కీలక పాత్రలో నటించాడు. ఈ అబ్బాయికి ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. దాని ద్వారానే అతను సినిమాల్లోకి వచ్చాడు.
యూట్యూబ్ చైల్డ్ గా పాపులర్ అయిన రిత్విక్, తన యూట్యూబ్ ఛానెల్ ‘రీతు రాక్స్’ లో డిఫరెంట్ గెటప్‌లు ధరించి, నటించిన వీడియోల ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఈ ఛానెల్ ను రిత్విక్ తండ్రి జోతిరాజ్ చూసుకుంటాడు. ఆగస్ట్ 2023 నాటికి, రిత్విక్ యూట్యూబ్ ఛానెల్ రీతు రాక్స్ 2.36 మిలియన్ సబ్‌స్క్రైబర్ లు ఉన్నారు. అతని వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మిలియన్ల వ్యూస్ ను సంపాదించాయి.
ప్రేమ అనేది నమ్మకం, ఎదుటి వ్యక్తి ఇచ్చే గౌరవం, కేరింగ్ లాంటి వాటితో నిలబడుతుంది. కానీ కండిషన్లు, డిమాండ్లతో ఏ బంధం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. అయితే ఒక వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్ పాటించాల్సిన 15 రూల్స్ చెప్పాడట. దానికోసం ఓ లిస్ట్ కూడా ఇచ్చాడట. ఆమె ఆ లిస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానిని చూసినవారు షాక్ అవుతున్నారు. నెటిజెన్లు అతని పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ట్రోల్ చేస్తున్నారు. 

మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, రెండవ సీజన్ కి హీరో నాని హోస్ట్ గా చేశారు. మూడవ సీజన్ నుండి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక రాబోయేగా సీజన్ కి కూడా ఆయనే హోస్ట్. బిగ్ బాస్ సీజన్ 7 ప్రమోషన్ లో భాగంగా రిలీజ్ చేసిన ప్రోమోలు ఈ సీజన్ పై అంచనాలను పెంచుతున్నాయి. ఏడవ సీజన్ సరికొత్తగా ఉండబోతుందని నాగార్జున ప్రోమోలలో హింట్ ఇస్తూ, ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచారు. ఇక ఈసారి ప్రోమోలను కూడా భిన్నంగా ప్లాన్ చేశారు.
తాజాగా రిలీజ్ అయిన ఈ ప్రోమో నటించిన అమ్మాయి ఎవరా అని నెటిజెన్లు ఆరా తీస్తూ, ఆన్ లైన్ లో వెతుకుతున్నారు. అయితే తాజాగా వచ్చిన ప్రోమో కనిపించిన అమ్మాయి పేరు అలేఖ్య రెడ్డి. కొత్త నటి కాదు. ఆమె ఇప్పటికే పలు తెలుగు చిత్రాలలో నటించింది. అయితే ఆమె చేసింది ఎక్కువగా సైడ్ రోల్స్ కావడంతో ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. ఈ ప్రోమోతో ఆమె ప్రేక్షకుల దృష్టిలో పడడంతో ఆమె గురించి వెతుకుతున్నారు.
అలేఖ్య రెడ్డి ఇంటింటి రామాయణం, అశోక వనంలో అర్జున కల్యాణం , అర్థమైందా అర్జున్ కుమార్ వంటి చిత్రాలలో సినిమాల్లో నటించింది. అలేఖ్య రెడ్డి ఒక్క ప్రోమోలోనే నటించిందా? లేదా బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గా కూడా ఉంటుందా అనే విషయం తెలియాల్సిఉంది. ఇక రాబోయే బిగ్ బాస్ సీజన్లో దాదాపు ఇరవై మంది పోటీదారులు పాల్గొంటున్నారని సమాచారం.వీరిలో ఎక్కువగా సెలెబ్రెటీలు ఉన్నట్టు తెలుస్తోంది.