టార్జాన్ లక్ష్మినారాయరణ అంటే అంతగా గుర్తు పట్టరేమో, కానీ పోకిరి మూవీలో మహేష్ బాబు కొడితే పన్ను విరిగిన యాక్టర్ అంటే గుర్తు పడతారు. ఆ నటుడి పేరు టార్జాన్ లక్ష్మినారాయరణ. ఆయన అసలు పేరు లక్ష్మినారాయరణ గుప్త.

Video Advertisement

టార్జాన్ లక్ష్మినారాయరణ ఎన్నో తెలుగు సినిమాలలో విలన్ గ్యాంగ్ లో ఉండే మెంబర్ గా నటించారు. గత నలబై ఏళ్ల నుండి ఇండస్ట్రీలో నటుడుగా కొనసాగుతున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన 20 సంవత్సరాల తరువాత పోకిరి మూవీ ద్వారా టార్జాన్ లక్ష్మినారాయరణ గుర్తింపు వచ్చింది.
టార్జాన్ లక్ష్మీనారాయణ మొదటిసారిగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా తెరకెక్కిన ‘గాయం’ మూవీలో శ్రీశైలం అనే క్యారెక్టర్ లో నటించాడు. ఆ తరువాత అనేక చిత్రాలలో విలన్ గ్యాంగ్ లో ఉండే మెంబర్ గా నటిస్తూ వచ్చాడు. ఆ తరువాత ఆర్యన్ రాజేశ్ హీరోగా నటించిన మూవీలో మెయిన్ విలన్ గా నటించాడు. కానీ ఆ మూవీ హిట్ కాలేదు. దాంతో సినిమాల కన్నా తమ సొంత ట్రాన్స్పోర్ట్ బిజినెస్ బెటర్ అని భావించి, అటు వైపుగా వెళ్ళాడు.
అలా పది ఏళ్లపాటు ఆ బిజినెస్ చూసుకుంటూ గడిపిన టార్జాన్ లక్ష్మినారాయరణ, ఆ తరువాత మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చాడు. అలా పోకిరి మూవీలో నటించిన టార్జాన్, మహేష్ బాబు చేతిలో పన్ను విరగొట్టుకునే పాత్రలో నటించి, గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా శ్రీ ఆంజనేయం, ఆర్య 2, అతనొక్కడే, అనుకోకుండా ఒక రోజు, ఖతర్నాక్, ఆంజనేయులు, సెల్ఫీ రాజా, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, నన్ను దోచుకుందువటే, అలా వైకుంఠపురములో వంటి సినిమాలలో నటించాడు.
టార్జాన్ లక్ష్మీనారాయణ చాలా సినిమాలలో హాస్యనటుడు మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా నటించాడు. ప్రస్తుతం తన నటన మెరుగుపరచుకోవడం కోసం నాటకాలలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. వందల సినిమాలలో నటించిన లక్ష్మీనారాయణ గుప్త తన కెరీర్ లో వివిధ రకాల పాత్రలను పోషించారు.

Also Read: “జైలర్” లో “రజినీకాంత్ మనవడు” పాత్రలో నటించిన ఈ అబ్బాయి ఎవరో తెలుసా..?