వరుసగా వస్తున్న రీ రిలీజులకు అభిమానులు కూడా బాబోయ్ అనుకునే కండిషన్ తలెత్తుతోంది. గతంలో రిలీజ్ అయ్యి, డిజాస్టర్లుగా నిలిచిన సినిమాలను కూడా వదలకుండా రీరిలీజ్ చేస్తున్నారు.

Video Advertisement

ఆ సినిమాలను ప్రోమోట్ చేస్తున్న విధానం మార్నింగ్ షోలను హౌస్ ఫుల్స్ అయ్యేలా చేస్తోంది. దానికి కారణం అప్పట్లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ గా నిలిచిన ఆరెంజ్ మూవీ రీరిలీజ్ కు వచ్చిన రెస్పాన్స్. త్వరలో రీరిలీజ్ అవుతున్న సినిమాల పై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
గత ఏడాది ‘పోకిరి’ తో మొదలైన రీరిలీజ్ ట్రెండ్ విజయవంతంగా కొనసాగుతోంది. స్టార్ హీరోల పుట్టిన రోజు సందర్భంగా వారి కెరీర్ లో హిట్ బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను రీరిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ హిట్ సినిమాలు రీరిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. ఎన్టీఆర్ నటించిన ‘సింహాద్రి’ కూడా రీరిలీజ్ లో మంచి వసూళ్లను సాధించింది.
అయితే గతంలో నిరాశపరిచిన రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ మూవీ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేయడంతో రీరిలీజ్ చేశారు. అప్పుడు డిజాస్టర్ అయిన ఈ మూవీ ఇప్పుడు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ విషయం ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆ తరువాత యావరేజ్ గా నిలిచిన చిన్న సినిమా ‘ఈనగరానికి ఏమైంది’ రీరిలీజ్ లో మంచి కలెక్షన్స్ సాధించి, పెద్ద సినిమాల లిస్ట్ లో నిలిచింది.
తాజాగా రీరిలీజ్ అయిన యోగికి కూడా అలాంటి రెస్పాన్స్ రావడంతో వరుసగా కొన్ని ప్లాప్ సినిమాలు రీరిలీజ్ సిద్ధం అయ్యాయి. అయితే స్టార్ హీరోలందరికి కాలంతో పని లేకుండా ఎప్పుడు రిలీజ్ అయినా ఫ్లాపే అనిపించే చిత్రాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిని టచ్ చేయకపోవడమే బెటర్ అని అంటున్నారు. రాఖీ, ఒక్క మగాడు, లయన్ సినిమాలను త్వరలో రీరిలీజ్ కాబోతున్నాయి. అయితే వీటి పై సోషల్ మీడియాలో మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు.

1.
2. 3. 4. 5.6.
7. 8. 9. 10. 11. 12. 13. 14.15.
16. 17.18.
Also Read: మెహర్ రమేష్ సినిమా గురించి… పూరి జగన్నాధ్ ఆ సినిమాలో అప్పుడే చెప్పారా..?