కొన్ని సంఘటనలు కాకతాళీయ జరిగినప్పటికీ, వాటికి మధ్య ఉండే కనెక్షన్ వింతగా అనిపించినా కూడా అందరూ నమ్మేలానే ఉంటాయి. ఇప్పుడు చెప్పుకునే విషయం కూడా అటువంటిదే. తెలుగు ఇండస్ట్రీలోనే అత్యంత లక్కీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు మెహర్ రమేష్.

Video Advertisement

ఇటీవల మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ‘భోళా శంకర్’ మూవీతో తనకున్న ట్రాక్ రికార్డుని పదిలంగా కొనసాగించాడు. అయితే ఈ మూవీ ప్లాప్ అవడంతో మెహర్ రమేష్ చుట్టూనే రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మెహర్ రమేష్ సినిమా గురించి పూరి జగన్నాధ్ తన సినిమాలో ముందే చెప్పారట. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించగా, కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటించింది. సుశాంత్ కీలక పాత్రలో నటించాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 11న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకున్న తీవ్రమైన ట్రోలింగ్ కు గురి అయ్యింది. ఈ మూవీలోని సీన్స్ ను షేర్ చేస్తూ ఓ రేంజ్ లో నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో మెహర్ రమేష్ సినిమాలకు ఇతర విషయాలతో ఉన్న కనెక్షన్స్ వెతికి పట్టుకొని మరి నెటిజెన్లు వైరల్ చేస్తున్నారు. మొన్నటి మొన్న మెహర్ రమేష్ సినిమాలు ప్లాప్ అయిన ఏడాది జరిగిన ప్రపంచ కప్ ఇండియకే వచ్చిందనే వార్త  వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ‘నేనింతే’ సినిమాలో మెహర్ రమేష్ తీసిన షాడో మూవీ గురించి ముందే చెప్పారనే విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
నేనింతే మూవీలో బ్రహ్మానందం తీసిన మూవీ పేరు షాడో. ఆ మూవీలోని పోస్టర్ పై ఉన్న షాడో ఫాంట్, మెహర్ రమేష్ తీసిన మూవీ షాడో ఫాంట్ ఒకేలా ఉంటాయి. నేనింతే మూవీ 2008 లో రిలీజ్ అయ్యింది. ఇక మెహర్ రమేష్ తీసిన షాడో మూవీ 2013 లో రిలీజ్ అయ్యింది. దాంతో మెహర్ రమేష్ షాడో మూవీ గురించి పూరి జగన్నాధ్ నేనింతే సినిమాలో ముందే చెప్పారా అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: “జైలర్” లో “రజినీకాంత్ మనవడు” పాత్రలో నటించిన ఈ అబ్బాయి ఎవరో తెలుసా..?