యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె నటిగా మారి పలు చిత్రాలలో కీలక పాత్రలలో నటిస్తూ, టాలీవుడ్ లో రాణిస్తోంది. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
Video Advertisement
అయితే ఆమెకు పాజిటివ్ ఇమేజ్ ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఆమె పై నెగటివ్ కామెంట్లు, ట్రోలింగ్ తరచుగా జరుగుతుంది. తాజాగా అనసూయ ఏడుస్తున్న వీడియోను ఇన్ స్టాలో షేర్ చేయగా, దాని పై కూడా నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
యాంకర్ మరియు నటి అనసూయ ఏడుస్తూ ఇన్ స్టాగ్రామ్ లో చిన్న వీడియోతో పాటుగా సుదీర్ఘమైన నోట్ కూడా షేర్ చేసి ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేసింది. ఆమె సుధీర్ఘమైన పోస్టును చూస్తే సోషల్ మీడియాలో తన పై వస్తున్న ట్రోలింగ్ కి బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది.
అనసూయ పెట్టిన పోస్టు సారాంశం, నాకు తెలిసినంతవరకు సోషల్ మీడియాను సమాచారం, కమ్యూనికేషన్ కోసం మొదట్లో వాడాం. ఆ తరువాత ప్రపంచంలోని జీవన శైలి, డిఫరెంట్ సంస్కృతి, సంప్రదాయల గురించి, నాలెడ్జ్ కోసం ఉపయోగించేవాళ్ళం. ఇక్కడికి ఒకరికొకరు సపోర్ట్ గా నిలవాలనే వస్తాం. ఆనందం, బాధ వంటి వాటిని పంచుకోవడానికి సోషల్ మీడియా ఉంటాం. నే సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రతి జ్ఞాపకం, ఫోటోలు, డాన్సులు, స్ట్రాంగ్ కౌంటర్లు, కంబ్యాక్ లు అన్ని నా జీవితంలో భాగమే.
ఎన్నో ఎత్తుపల్లాలు, ఎదురుదెబ్బలు వచ్చాయి. ఒక పబ్లిక్ ఫిగర్ గా ఇలాంటి వాటిని నేను తప్పించుకోలేను. వాటికి తలొగ్గను. ప్రతి ఒక్కరికి చెడు రోజులు వస్తాయి. 5 రోజులు క్రితం జరిగిన ఇన్సిడెంట్ కి స్పందన ఇది. ఈ పోస్ట్ పూర్తి వివరాలు అనసూయ పెట్టిన పోస్టులో లేవు. ఆమెను అంతగా బాధపెట్టిన వ్యక్తి గురించి లేదా ఇన్సిడెంట్ గురించి ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. అంత సుధీర్ఘ సందేశంలో క్లారిటీ ఇవ్వలేదు.