ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్స్ ఎంతో మంది వస్తుంటారు. అలా ఇటీవల హనుమాన్ సినిమాతో హిట్ కొట్టారు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. నాని నిర్మాతగా మరి నిర్మించిన మొదటి సినిమా అయిన అ! సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ప్రశాంత్ వర్మ.
ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా లభించింది. అసలు ఇలాంటి సబ్జెక్ట్ ఉన్న సినిమాలు అప్పటి వరకు రాలేదు. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా నటించిన కల్కి సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా హిట్ సాధించింది. ఆ తర్వాత తేజ సజ్జా హీరోగా నటించిన జాంబీ రెడ్డి సినిమాకి దర్శకత్వం వహించారు ప్రశాంత్ వర్మ.

ఈ సినిమా కూడా డిఫరెంట్ సినిమా అని గుర్తింపు సంపాదించుకుంది. ప్రతి సినిమాకి ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండేలాగా తాపత్రయ పడుతూ ఉంటారు ప్రశాంత్ వర్మ. ఇప్పుడు హనుమాన్ సినిమా తర్వాత ఈ సినిమా సీక్వెల్ జై హనుమాన్ వస్తుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో కొన్ని సినిమాలు వస్తాయి అని ప్రకటించారు. అయితే మరొక పక్క ప్రశాంత్ వర్మ ఒక ఫిమేల్ సూపర్ హీరో ఓరియెంటెడ్ సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరు అని ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో నటించే హీరోయిన్ తనే అంటూ ఒక హీరోయిన్ పేరు ప్రచారంలోకి వచ్చింది.

క్రాక్, దూత వంటి సిరీస్ లో నటించిన జ్ఞానేశ్వరి కండ్రేగుల ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తారు అని వార్త బయటికి వచ్చింది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అని తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకు ఆగాల్సిందే. అంతే కాకుండా ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమేనా కాదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జ్ఞానేశ్వరి ఈ విషయం మీద మాట్లాడుతూ, ప్రశాంత్ వర్మ తనతోనే సినిమా చేస్తున్నారు అని చెప్పారు. దాంతో సూపర్ హీరో సినిమాలో హీరోయిన్ గా నటించేది జ్ఞానేశ్వరి అనే విషయం ప్రస్తుతం వార్తల్లో ఉంది. ఇంకా కొన్ని రోజుల్లో ఈ విషయం మీద అధికారిక ప్రకటన వస్తుంది అని అంటున్నారు.
watch video :
ALSO READ : సీనియర్ హీరోల చూపంతా ఇప్పుడు ఈ యంగ్ హీరోయిన్ పైనే అనుకుంట.? హీరోలనే డామినేట్ చేస్తుందిగా.!




















లోకనాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఎన్టీఆర్ పుణ్య తిథి, ఏఎన్ఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి ఎన్టీఆర్ తో ఏఎన్ఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకున్నారు. ఒకసారి ఎన్టీఆర్ ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆప్యాయంగా పలకరించి… రండి బ్రదర్ కూర్చోండి… మీరు బాగా వృద్ధిలోకి వస్తున్నారు… మీరు మీ సంపాదనను ఇనుపు ముక్కల మీద పెట్టకండి… స్థలాలు, ఇల్లు కొనుక్కోండి అవే మనల్ని కాపాడతాయి… స్టార్ డం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు అని సలహా ఇచ్చారట.

