టీం ఇండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. అయిదు టెస్టుల నిమిత్తం ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న భారత జట్టు సమిష్టి కృషి వలన 2 -1 ఆధిక్యత సాధించిన సంగతి తెలిసిందే. నిన్న మాంచెస్టర్ లో జరగవలసిన మ్యాచ్ ఆఖరి రెండు గంటల ఆట ముందు రద్దయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టీం ఇండియా హెడ్ కోచ్ రవి శాస్త్రి కొవిడ్ బారిన పడటం.
అసిస్టెంట్ ఫిజియో యోగేష్ పర్మార్ కూడా ఈ మహమ్మారి భారిన పడటం తో ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి దీని పరిణామం హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పైన కూడా పడింది. ఏకకంగా తదుపరి ఐపీఎల్ పైన కూడా పడనుంది ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ ఆ జట్టు తరపున ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అసిస్టెంట్ ఫిజియో యోగేష్ పర్మార్ తో సన్నిహితంగా ఉన్న వారిలో రోహిత్ శర్మ, షమీ, జడేజా, పుజారా, ఇషాంత్ శర్మ లు ఉన్నారు.
ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫిజియో నితిన్ పటేల్‌లను వీరిని కూడా ముందస్తుగా ఐసోలేషన్ కి తరలించిన వీరిలో ముగ్గురికి కొవిడ్ పాజిటివ్ గా తేలింది. జట్టు సభ్యులకి నిన్న ఆర్టీపీసీయర్ టెస్టుల్లో అందరికీ నెగటివ్ గా తేలింది కానీ మూడు నాలుగు రోజులకి కానీ కొవిడ్ లక్షణాలు బయటపడవు. యోగేష్ పర్మార్‌కు తో సన్నిహితంగా ఉన్న ఆటగాళ్లందరి పైన కఠినంగా వ్యవహరించనుంది బీసీసీఐ. పది రోజుల పాటు రోహిత్, ఇషాంత్, జడేజా, పుజారా లని ఇషాలేషన్ లో ఉంచనున్నారు. నిజానికి ఐపీల్ కోసమే అయిదవ టెస్ట్ ని రద్దు చేసుకుంది బీసీసీఐ.
దీనితో ముంబయి ఇండియన్స్ మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కి దూరం గా ఉండనున్నాడు రోహిత్, ఇక మరో ఆటగాడు జడేజా ది కూడా ఇదే పరిస్థితి. గాయం కారణంగా అసిస్టెంట్ ఫిజియో యోగేష్ పర్మార్ కి సన్నిహితంగా ఉన్నారు రోహిత్, పుజారా, ఇషాంత్ లు ఒక వేళ వీరిలో ఎవరికైనా పాజిటివ్ గా నిర్ధారణ అయితే పరిస్థితులు మరింత కఠినంగా ఉంటాయి. అప్పుడు రోహిత్ మిగతా ఐపీల్ సీజన్ మొత్తానికి దూరం కావాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇదే విషయంలో ముంబై ఇండియన్స్ టీం మేనేజ్మెంట్ ని భయపెడుతుంది