చాణక్యుడు ఎంతటి మహా జ్ఞానో అందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన నీతి సూత్రాలు, ఆరోగ్య సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయమైనవి. ఆయన రచించిన అర్థశాస్త్రంలో ఎంతో జ్ఞానం మిళితమై ఉంది. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు.
చాణక్య నీతి ప్రతి అంశాన్ని కూడా ఎంతో అద్భుతంగా వివరించింది. చాణక్యుడు మనిషి లో ఈ లోపం ఉండకూడదని.. ఈ లోపం ఉండడం వలన గెలుపు సాధ్యం కాదని అన్నారు.
మరి చాణక్యుడు చెప్పిన దాని కోసం ఇప్పుడు చూద్దాం. ఈ లోపం లేకుండా ఉంటే తప్పక మనం గెలవడానికి అవుతుంది. మొదట విజయాన్ని చేరుకోవాలంటే ప్రయత్నం ఉండాలి. ప్రయత్నం లేదంటే ఏది సాధ్యం కాదు. కనుక ముందు ప్రయత్నం చెయ్యండి. అలానే గెలవాలి అంటే మనసును ఎలా నియంత్రించాలో తెలుసుకు తీరాలి. లేదంటే గెలుపే ఉండదు. ఓటమి తప్ప. ఎప్పుడైనా సరే మనిషి ఏ తప్పు చెయ్యకుండా ఉండేలా చూసుకోవాలి.
తప్పు గెలుపు కి అడ్డం వస్తుంది. కాబట్టి అలాంటి అవరోధాలు ఏమి కలుగకుండా ఉండాలంటే మనసును అదుపులో ఉంచుకుంటే చాలు అని చాణక్య నీతి ద్వారా ఆచార్య చాణక్య చెప్పారు. మనసును నియంత్రించకపోవడమే అతి పెద్ద లోపమట. మనసును నియంత్రించక పోవడం వలన ఏమి చేసేందుకు అవ్వదు. దేని మీద కూడా ఆసక్తి చూపించేందుకు కూడా అవ్వదు. కాబట్టి ఈ ఒక్క తప్పు లేకుండా చూసుకుని గెలిచేందుకు ప్రయత్నం చెయ్యండి. విజయం తధ్యం.