మెదడు ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెదడు ఆరోగ్యం కోసం సరైన ఆహార పదార్థాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి మెదడు ఆరోగ్యం బాగుండాలంటే ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్:

ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ని తీసుకోవడం వలన మెదడు ఆరోగ్యం బాగుంటుంది. జ్ఞాపకశక్తిని పెంచడానికి ఇది సహాయపడుతుంది.

#2. ఐరన్:

ఐరన్ కూడా మనకి చాలా అవసరం. మెదడు ఆరోగ్యానికి ఐరన్ ఎంతో ముఖ్యం. కాగ్నిటివ్ డెవలప్మెంట్ బ్రెయిన్ ఫంక్షన్స్ కి ఐరన్ తప్పక కావాలి.

#3. విటమిన్ బి12:

విటమిన్ బి12 ని డైట్ లో చేర్చుకోవడం వలన మూడ్ బాగుంటుంది అలానే మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.

#4. విటమిన్ డి:

విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అలానే మెదడు ఆరోగ్యానికి కూడా ఇది చాలా అవసరం. విటమిన్ డి అందడం వలన డిమెన్షియా వంటి సమస్యలు రావు.

#5. జింక్:

జింక్ ని కూడా డైట్ లో తీసుకుంటూ ఉండాలి. నర్వ్ సిగ్నలింగ్ కోసం జింక్ చాలా అవసరం.

#6. విటమిన్ ఈ:

విటమిన్ ఈ మెమరీని బూస్ట్ చేస్తుంది అలానే మెదడుకు సంబంధించిన సమస్యలు రాకుండా ఇది చూస్తుంది.

#7. మెగ్నీషియం:

మైగ్రేన్, డిప్రెషన్, న్యూరాలజికల్ సమస్యలు రాకుండా మెగ్నీషియం సహాయపడుతుంది.

#8. క్యాల్షియం:

క్యాల్షియం న్యూరో ట్రాన్స్మిటర్లని విడుదల చేయడానికి సహాయపడుతుంది కాబట్టి కాల్షియం ని కూడా డైట్ లో తప్పకుండా చేర్చుకోండి. సెలీనియం, విటమిన్ కె ని కూడా డైట్లో తీసుకుంటూ ఉండాలి ఇవి కూడా బ్రెయిన్ ఆరోగ్యానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి.