ఈ మధ్యకాలంలో బయట అందుబాటులో ఉన్న వాహనాలు కంటే ప్రైవేట్ సంస్థలు అందించే క్యాబ్ సర్వీసెస్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దానికి ప్రముఖ కారణం సెక్యూరిటీ. అయితే వీటిలో ఓలా మరియు ఊబర్ సంస్థలు చాలా పాపులర్ అనే చెప్పాలి.
కానీ ఈ క్యాబ్ సర్వీసెస్ తో వచ్చే నష్టం ఒక్కటే, కస్టమర్ క్యాబ్ బుక్ చేసిన తర్వాత డ్రైవర్ క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. దాని వల్ల కస్టమర్లు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. మరి దానికి కారణం ఏమిటి…? డ్రైవర్ కి ఎందుకు క్యాబ్ ను క్యాన్సిల్ చేస్తున్నారు…?

నిజానికి కస్టమర్ క్యాబ్ బుక్ చేసిన తర్వాత డ్రైవర్ కాల్ చేసి లొకేషన్ ను కన్ఫామ్ చేసుకుంటారు. తర్వాత అసలు రైడ్ కి ఎంత డబ్బులు వస్తాయి, ట్రాఫిక్ ఎంత ఉంటుంది, ఫ్యూయల్ ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాల గురించి ఆలోచించి వారికి గిట్టుబాటు అయితేనే వాళ్ళు క్యాబ్ కన్ఫామ్ చేస్తారు. ఒకవేళ పికప్ లొకేషన్ దూరంగా ఉంటే లేక ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే క్యాబ్ క్యాన్సిల్ చేస్తారు.

క్యాబ్ సర్వీసెస్ గురించి తెలియని విషయం ఏంటంటే ప్రైవేట్ కంపెనీ వాళ్లు ఒక రైడ్ ద్వారా డ్రైవర్ నుండి 30 శాతం వరకు కమిషన్ తీసుకుంటారు. అలాంటప్పుడు డ్రైవర్ కమిషన్ను తీసి లెక్క వేసుకుంటారు. ఈ విధంగా ఆలోచించి కూడా క్యాన్సిల్ చేస్తారు.

సహజంగా ప్రైవేట్ సంస్థ డ్రైవర్లకు వారానికి ఒకసారి పేమెంట్ చేస్తుంది, అందుకే కొంత మంది క్యాబ్ డ్రైవర్లు వారికి డబ్బు చేతికి అవసరమైనప్పుడు క్యాష్ పేమెంట్ అయితేనే వస్తామని చెబుతారు. ఇవే క్యాబ్ క్యాన్సిల్ అవ్వడానికి గల కారణాలు.
Note: All the images used in this article are just for representative purpose only. But not the actual characters
























