భారత మొట్ట మొదటి కేంద్ర బడ్జెట్ ఎంతో తెలుసా..? అప్పటికి భారతదేశ అప్పు, వడ్డీ చెల్లింపులు ఎంత ఉన్నాయంటే..?

భారత మొట్ట మొదటి కేంద్ర బడ్జెట్ ఎంతో తెలుసా..? అప్పటికి భారతదేశ అప్పు, వడ్డీ చెల్లింపులు ఎంత ఉన్నాయంటే..?

by Megha Varna

Ads

ఇప్పుడు బడ్జెట్ గురించి మనం చూస్తున్నాం, వింటున్నాం. కానీ కొన్నేళ్ల క్రితం ప్రవేశపెట్టిన మొట్ట మొదటి కేంద్ర బడ్జెట్ గురించి చాలా మందికి తెలియదు. మొట్ట మొదటి కేంద్ర బడ్జెట్ ని 1947-48 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆర్‌కే షన్ముఖం చెట్టి తీసుకు రావడం జరిగింది. అయితే దీనిని 1947 నవంబర్ 26వ తేదీన పార్లిమెంట్ లో ప్రవేశ పెట్టారు.

Video Advertisement

ఈ బడ్జెట్ కేవలం ఏడు నెలలకే. అంటే 1947 ఆగస్టు 15వ తేదీ నుంచి 1948 మార్చి 31 వరకు. ఆ బడ్జెట్ లో ఆహార, పారిశ్రామిక ఉత్పత్తి, దిగుమతుల్ని తగ్గించి…స్వయం సమృద్ధి సాధించటంపై ఫోకస్ పెట్టారు. అలానే భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఆ బడ్జెట్ ని తీసుకొచ్చారు. సమాజంలో శాంతి భద్రతలను తీసుకు రావాలని కూడా అన్నారు.

ఆదాయ అంచనా రూ.171.15 కోట్లు, వ్యయం అంచనా రూ.197.39 కోట్లు, లోటు రూ.26.24 కోట్లు. ఆదాయ అంచన రూ.171.15 కోట్లు అని అన్నారు. కస్టమ్స్ నుంచి రూ.50.5 కోట్లు, ఆదాయపు పన్ను ద్వారా రూ.29.5 కోట్లు, సాధారణ వసూళ్లు రూ.88.5 కోట్లు. ఇది ఇలా ఉంటే పోస్టు, టెలిగ్రాఫ్‌ల శాఖ నుంచి ఆదాయం రూ.15.9 కోట్లు, ఖర్చు, వడ్డీ రూ.13.9 కోట్లు. నికర మిగులు అంచనా రూ.2 కోట్లు. ఇక రైల్వేల విషయానికి వస్తే.. ఎలాంటి ఆదాయం ఆశించడం లేదు ఈ ఏడాది అని అన్నారు.

రూ.197.39 కోట్లలో… రూ.92.74 కోట్లు రక్షణ సేవలకు. మిగతాది పౌర ఖర్చులకు. విభజన వలన ఖర్చు పెరిగిందిట. అలానే స్టెర్లింగ్ పద్దు కింద 1946 ఏప్రిల్ 5 నాటికి అత్యధికంగా రూ.1733 కోట్లు ఉన్నాయి. కానీ 1947 మార్చి నాటికి 1612 కోట్లకు తగ్గాయి. కొత్త అధికారం వచ్చాక రూ.1547 కోట్లు వున్నాయి. ఆరు నెలల్లోనే రూ.65 కోట్లు తీసుకున్నాం. లేదు అంటే యుద్ధ సమయంలో ఆకలితో మృతి చెంది ఉండేవారు అని చెప్పారు.

అలానే 1946 మార్చి 31వ తేదీ వరకు ఈ పద్దు కింద మనం రూ.405 కోట్ల విలువైన అమెరికన్ డాలర్లు సంపాదించి, రూ.240 కోట్ల విలువైన అమెరికన్ డాలర్లు ఖర్చు చేశాం అని చెప్పారు. అయితే దానిలో రూ.165 కోట్లు మిగిలాయి. కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, పోర్చుగల్ దేశాల కరెన్సీల్లో రూ.51 కోట్లు ఖర్చు చేయగా రూ.114 కోట్లు మిగిలాయి. ప్రణాళిక, అభివృద్ధి పద్దు కింద రూ.100 కోట్లని యుద్ధం అయ్యాక పెడితే వాటిలో రూ.45 కోట్లు ప్రావిన్సులకు గ్రాంటులు. అఖండ భారతదేశ అప్పు, వడ్డీ చెల్లింపులు మొత్తం రూ.2531 కోట్లు. విదేశీ నిల్వలు రూ.1600 కోట్లు. పాకిస్తాన్ వాటిని ఇందులో నుండి తీసేయాలి.


End of Article

You may also like