చనిపోయిన వారి అస్థికలను గంగలో కలిపేస్తారు.. ఆ తరువాత ఆ అస్థికలు ఎక్కడకి వెళ్తాయో తెలుసా…?

చనిపోయిన వారి అస్థికలను గంగలో కలిపేస్తారు.. ఆ తరువాత ఆ అస్థికలు ఎక్కడకి వెళ్తాయో తెలుసా…?

by Megha Varna

Ads

హిందూ ధర్మం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క అస్థికలను తీసుకు వెళ్లి పవిత్రమైన నదిలో కలుపుతారు. అలా చేయడం వల్ల వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని అంటూ ఉంటారు. అలానే వ్యక్తి చనిపోయిన తర్వాత వివిధ రకాల కార్యక్రమాలు జరుపుతారు. గంగానది ఒడ్డున ఎక్కువగా దహన సంస్కారాలను చేస్తూ ఉంటారు.

Video Advertisement

ఆ తర్వాత చితాభస్మాన్ని గంగలో నిమజ్జనం చేసే సంప్రదాయం తరతరాల నుండి వస్తోంది. ఒకవేళ కనుక గంగా నది చనిపోయిన వ్యక్తి ప్రదేశానికి చాలా దూరంగా ఉంటే అస్తికలను ఒక దాంట్లో భద్రపరిచి ఆ తర్వాత వాటిని గంగా నది వద్దకు తీసుకువెళ్లి కలుపుతూ ఉంటారు.

గంగా నదిలో అస్తికలు నిమజ్జనం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని పెద్దలు అంటూ ఉంటారు. అయితే ఎప్పుడైనా సందేహం కలిగింద..? నదిలో అస్థికల నిమజ్జనం చేసాకా అవి ఎక్కడికి వెళ్తాయి అని.. మరి దాని గురించి ఇప్పుడు చూద్దాం. సనాతన ధర్మంలోని విశ్వాసాల ప్రకారం మరణించిన వ్యక్తి యొక్క ఆస్తికలని గంగా నదిలో కలిపితే వారి ఆత్మకు శాంతి కలుగుతుంది అని అంటారు.

అందుకే గంగలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇలా గంగానదిలో నిమజ్జనం చేసిన అస్తికలు నేరుగా శ్రీహరి పాదాల వద్దకు వెళ్తాయిట. అలానే గంగా నది దగ్గర మరణించిన వ్యక్తికి మోక్షం లభిస్తుందని కూడా అంటూ ఉంటారు. ఇది మన పురాణాల ప్రకారం అయితే.. సైన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే.. ఎముకల్లో ఉండే క్యాల్షియం, పాస్ఫరస్ నీటిలో కరిగిపోతాయి.

ఇవి జలచరాలకు పోషకాహారంగా మారతాయి. ఎముకల్లో ఉండే సల్ఫర్ నీటిలో ఉండే పాదరసం తో కలిసి ఉప్పును ఏర్పరుస్తుంది. ఎముకల్లో ఉండే క్యాల్షియం నీటిని శుభ్రంగా కూడా మార్చేస్తుంది. దీంతో నీటిలో అస్థికలను కలపడం వల్ల నీరు మరింత స్వచ్ఛంగా మారతాయి.


End of Article

You may also like