అవికా గోర్ నటించిన వధువు వెబ్ సిరీస్ చూశారా..? ఎలా ఉందంటే..?

అవికా గోర్ నటించిన వధువు వెబ్ సిరీస్ చూశారా..? ఎలా ఉందంటే..?

by Mounika Singaluri

Ads

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా అవికా గోర్ తెలుగు బుల్లితెరకు పరిచయం అయ్యారు. కథానాయికగా కూడా కొన్ని సినిమాలు చేశారు. ఇప్పుడు ‘వధువు’ అంటూ వెబ్ సిరీస్ చేశారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నందు, అలీ రేజా ప్రధాన పాత్రధారులు. బెంగాలీ వెబ్ సిరీస్ ‘ఇందు’కి రీమేక్ ఇది

Video Advertisement

ఇందు (అవికా గోర్)కు కాబోయే భర్తను తన సొంత చెల్లెలు లేపుకు వెళ్ళడంతో ఒకసారి పెళ్లి ఆగిపోతుంది. రెండోసారి ఆనంద్ (నందు)తో ఇందుకి పెళ్లి కుదురుతుంది. పెళ్లి పత్రికతో చెల్లెలు దిగుతుంది. మరో వైపు అమ్మాయి ఇంటికి అబ్బాయి ఇంటి నుంచి సారెలో ఉండే పనసపండును ఎవరో కోసి జిల్లేడు ఆకు పెట్టి కుడతారు. ఇలా ఆనంద్, ఇందుల పెళ్లిని ఆపడానికి ప్రయత్నాలు జరుగుతాయి.

avika gor vadhuvu web series

వీళ్ళ పెళ్లి ఆపాలని ప్రయత్నించింది ఎవరు? ఇందు అత్తారింటిలో అడుగు పెట్టిన తర్వాత ఆమె అనుకుని ఆడపడుచు మీద హత్యా యత్నం చేసినది ఎవరు? ఆనంద్ తమ్ముడు ఆర్య (అలీ రేజా) పెళ్లి పెటాకులు కావడానికి కారణం ఏమిటి? అతడి భార్య వైష్ణవి ఎక్కడ ఉంది? అతడి పెళ్లి విషయాన్ని, ఆనంద్ & ఆర్యల పెద్దమ్మ కుమార్తెకు మతిస్థిమితం లేని విషయాన్ని ఇందు దగ్గర ఎందుకు దాచారు? పెళ్లైన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవకు, అనుమాస్పద ఘటనలకు కారణం ఎవరు? అనేది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి…!

avika gor vadhuvu web series

థ్రిల్లర్ సిరీస్ లకి ఓ ఫార్మటు ఉంటుంది.రొటీన్ టెంప్లేట్ ఉంటుంది. అయితే..కంటికి కనిపించని శత్రువు ఎవరు? అనేది తెలుసుకోవాలని ప్రేక్షకుడిలో ఓ ఆలోచన, ఆసక్తి, కుతూహలం రేకెత్తించగలిగితే దర్శకుడు, నటీనటులు సక్సెస్ అయినట్లే! ‘వధువు’ ఆ కోవకే చెందుతుంది .మేకర్స్ ఈ విషయంలో 100 పర్సెంట్ సక్సెస్ అయ్యారు. వధువు ప్రారంభం నుండి కూడా కథతో పాటు ప్రేక్షకుడు సైతం ప్రయాణం చేసేలా దర్శక, రచయితలు సన్నివేశాలు రూపొందించారు.

avika gor vadhuvu web series

లాజిక్స్ గురించి ఆలోచించకుండా స్క్రీన్ ప్లే తో మేజిక్ వర్కవుట్ అయ్యేలా చేశారు. రెగ్యులర్ ,రొటీన్ టెంప్లేట్ సిరీస్ తరహాలో కథ ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి ఎపిసోడ్‌లో కొత్త వ్యక్తి మీద అనుమానం కలిగేలా చేశారు. పెళ్లి మండపంలో అమ్మాయి బాబాయ్ వచ్చి అన్నయ్యా అన్న ప్రతిసారీ మళ్ళీ పెళ్లి ఆగిపోయింది అని ప్రేక్షకుడు ఓ నిర్ణయానికి వచ్చేలా తీసిన సన్నివేశాలు బావున్నాయి.

avika gor vadhuvu web series

అక్క పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తిని చెల్లెలు లేపుకుపొడానికి, పెళ్లి కొడుకు లేచిపోవడానికి చెప్పిన కారణం కన్విన్సింగ్‌గా లేదు. మధ్యలో కొన్ని రొటీన్ సీన్స్, ఎఫైర్స్ అంటూ చూపించినవి కథలో పోసగలేదు.అసలు కథను అసంపూర్తిగా ముగించారు. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా బాహుబలి 1 చిత్రాన్ని ముగించినట్టు అసలు దోషి ఎవరో చెప్పకుండా వధువు సీజన్ 1కు ఎండ్ కార్డు వేశారు.

avika gor vadhuvu web series

టెక్నికల్ గా చూసుకుంటే శ్రీరామ్ మద్దూరి బీజీఎంతో సస్పెన్స్ బిల్డ్ చేశారు. సినిమాటోగ్రఫీ ఓకే. ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి. అవికా గోర్ స్క్రీన్ ప్రజెన్స్ ‘వధువు’కు ప్లస్ అయ్యింది. పెళ్లి ఆగిపోతుందేమో అనే భయం నుంచి ఆ తర్వాత ప్రతి సందర్భంలోనూ ఆయా సన్నివేశాలకు తగ్గట్టు నటించారు. యాంగ్రీ యంగ్ మేన్ తరహా పాత్రలో నందు చక్కగా చేశారు.అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తిగా అలీ రేజా కనిపించారు. రూప లక్ష్మితో పాటు మిగతా నటీనటులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఫైనల్ గా ప్రేక్షకులు ఉత్కంఠగా చూసే గ్రిప్పింగ్, థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ ఇది. నిడివి తక్కువ కావడంతో ఒక్కసారి స్టార్‌ చేస్తే టైం తెలిసే లోపే అయిపోతుంది


End of Article

You may also like