నాలుగు అవార్డ్స్ సొంతం చేసుకున్న “మంగళవారం”. ఏ కేటగిరీలో అంటే.?

నాలుగు అవార్డ్స్ సొంతం చేసుకున్న “మంగళవారం”. ఏ కేటగిరీలో అంటే.?

by Mounika Singaluri

డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ తాజాగా నటించిన చిత్రం మంగళవారం. ఇటీవల ఓటిటిలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీని స్వాతి గుణుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అజయ్ ఘోష్, నందిత శ్వేత, కృష్ణ చైతన్య, దివ్య పిళ్లై తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీకి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం కాస్త వెనకబడింది అని తెలుస్తోంది.

Video Advertisement

రీసెంట్ గా ఈ సినిమాకి ఓ ఫిలిం ఫెస్టివల్ లో అవార్డుల పంట కురిసింది. జైపూర్ ఫిలిం ఫెస్టివల్ లో 4 అవార్డులని గెలుచుకుంది ఈ సినిమా. ఉత్తమ నటి (పాయల్ రాజపుత్), ఉత్తమ సౌండ్ డిజైన్ (రాజా కృష్ణన్), ఉత్తమ ఎడిటింగ్ (గుళ్ళపల్లి మాధవ్ కుమార్), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ (ముదసర్ మొహమ్మద్). వీరికి అవార్డులు ప్రకటించారు.

ఈ మూవీ తాజాగా OTT లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌ పెర్ఫామెన్స్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుండి పాయల్‌ తో పాటు ఇంకో హీరోయిన్ గురించి కూడా నెట్టింట్లో చర్చలు జరుగుతున్నాయి.

పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా అజయ్ భూపతి తెరకెక్కించిన ‘ఆర్ఎక్స్ 100’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిదో అందరికీ తెలిసిందే. ఆ మూవీ తరువాత వీరిద్దరూ ఆ రేంజ్ లో హిట్ అందుకోలేదు. మళ్లీ వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘మంగళవారం’ మూవీ కి హిట్ టాక్ వచ్చింది. ఈ మూవీలో ఇతర హీరోయిన్లు ఈజీగా ఒప్పుకోని పాత్రలో పాయల్‌ రాజ్‌పుత్‌ నటించింది. ఆమె పెర్ఫామెన్స్ తో ప్రశంసలు కూడా అందుకుంటోంది.

మూవీలో చివర్లో హైలైట్ గా నిలిచింది మాత్రం జమీందారు భార్యగా నటించిన నటి. క్లైమాక్స్ లో షాకింగ్ ట్విస్టు ఇచ్చిన ఆ నటి ఎవరా అని నెట్టింట్లో వెతుకుతున్నారు. ఆ నటి పేరు దివ్యా పిళ్లై, మలయాళ నటి. ఆమె మలయాళంలో అనేక సినిమాలలో నటించింది. ఓటీటీలో సూపర్ హిట్ గా నిలిచిన టొవినో థామస్ ‘కలా’ మూవీలో హీరో భార్యగా నటించింది.


You may also like

Leave a Comment