పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. గత కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరగనుందని ఇరవై రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వార్త షికారు చేసింది.

Video Advertisement

జూన్ 3న జరిగే ‘ఆదిపురుష్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్‌గా డైరెక్టర్ రాజమౌళి రాబోతున్నారని వినిపించింది. అయితే తాజాగా యూవీ క్రియేషన్స్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో నిర్వహించనున్నట్టు అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. అయితే జూన్ 3న కాకుండా జూన్ 6న ఈ వేడుక జరగనుంది. ఈ క్రమంలో బాహుబలి మూవీ వార్తల్లో నిలిచింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
హీరో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మైథలాజికల్ చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ నటించారు. రామాయణం ఆధారంగా ఇప్పటికే అనేక చిత్రాలు రూపొందాయి. అయితే ఈ చిత్రాన్ని ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి తగ్గట్టుగా గ్రాండ్‌గా సిల్వర్ స్క్రీన్ పై చూపించే ప్రయత్నం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ చేస్తున్నారు.
ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసినపుడు ఆడియెన్స్ నుండి విమర్శలు చేశారు. ఇప్పటి దాకా వచ్చిన రామాయణం చిత్రాలను చూసిన ఆడియెన్స్ కి దర్శకుడు చేసిన మార్పులు అసలు నచ్చలేదు. టీజర్ యానిమేషన్‌లా ఉందనే  ట్రోల్స్ వచ్చాయి. హిందూవాదులు కూడా రావణాసురుడి క్యారెక్టర్ చిత్రీకరణను పూర్తిగా వ్యతిరేకించారు. ఇక హనుమంతుడికి గెడ్డం పెట్టడం హిందూవాదులకు అసలు నచ్చలేదు.
the man who acted as hanuman in aadipurush movie..ఈ విమర్శల తరువాత మూవీ పై మరింత ఫోకస్ చేసిన ఓం రౌత్, ట్రైలర్ తో ఆడియెన్స్ ని ఆకట్టుకున్నారు. 3డీలో ట్రైలర్‌ను చూసిన ఆడియెన్స్ చాలా బాగుందని మెచ్చుకున్నారు. జూన్ 16న ఈ చిత్రం 5 భాషల్లో భారీగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా తిరుపతిలో జూన్ 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ప్రకటన వచ్చిన నేపథ్యంలో బాహుబలి సినిమా తెరపైకి వచ్చింది.
టాలీవుడ్ హీరో ప్రభాస్‌‌ను పాన్ ఇండియా స్టార్‌‌గా మార్చిన చిత్రం ‘బాహుబలి: ది బిగినింగ్’. ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ తిరుపతిలోనే నిర్వహించారు. 2015 లో జూన్ 13న తిరుపతిలోని ఎస్వీ గ్రౌండ్స్‌లో బాహుబలి ఆడియో లాంచ్ వేడుక జరిగింది. ఆ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.
8 ఏళ్ళ తరవాత జూన్ 6న  ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ వేడుక తిరుపతిలో జరగనుంది. దాంతో బాహుబలి సినిమా లాగే ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా బాహుబలి సెంటిమెంట్ వాడుతున్నారంటే ఈ మూవీ కూడా సూపర్ హిట్ అవుతుందంటూ మీమ్స్ షికారు చేస్తున్నాయి.

Also Read: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న ‘గోపీచంద్’ “రామ‌బాణం” మూవీ.. ఎప్పుడు రాబోతుందంటే..!!