యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయి.. ఒక్కసారిగా బేబీ సినిమాతో ఓ ఎత్తుకు వెళ్లిన హీరోయిన్ వైష్ణవి చైతన్య. ప్రస్తుతం ఎవరి నోట వింటున్న ఈమె పేరే.
Video Advertisement
ఎందుకంటే బేబీ సినిమాలో ఈమె నటనకు ధియోటర్లలో చూసిన ప్రతిఒక్కరూ ఫిదా. తన నటనతో అందరి దృష్టిలో పడి ఓ క్రేజీ ఆఫర్‌ను కొట్టేసింది ఈ భామ. ఒక్క సినిమాతోనే తన టాలెంట్‌ను చూపించిన వైష్ణవి.. యూత్ గుండెల్లో బేబీగా బలమైన ముద్ర వేసుకుంది. ఈ సినిమా హిట్ కావడంతో వైష్ణవికి వరుస అవకాశాలు రావడం ఖాయమని అందరు అనుకున్నారు.
అనుకున్న ప్రకారమే.. ఆమె రెండు ప్రాజెక్టుల్లో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ఒక ప్రాజెక్ట్.. బొమ్మరిల్లు భాస్కర్, మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో జొన్నలగడ్డ సిద్ధు కాంబోలో వస్తున్న చిత్రానికి హీరోయిన్‌గా వైష్ణవిని ఎంపిక అయినట్లు తెలుస్తుంది. చిన్న సినిమాగా వచ్చిన బేబీ కొత్త రికార్డులను క్రియేట్ చేసి.. భారీ వసూళ్లను అందుకున్న సంగతి తెలిసిందే.