ఒక మూవీ కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో వసూళ్లు రాబడతాయో ‘బేబీ’ మూవీ నిరూపించింది. నెగిటివ్ రివ్యూలు, నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ ఈ మూవీ ఊహించని స్థాయిలో వసూళ్లను సాధించింది. చిన్న మూవీగా రిలీజ్ అయిన ‘బేబి’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యతో పాటుగా కీలక పాత్రలో విరాజ్ అశ్విన్ నటించారు.

Video Advertisement

ఈ మూవీలో నటించిన యాక్టర్స్ పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ వంటి సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. ఈ మూవీ దర్శకుడు సాయి రాజేష్ ఒక ఇంటర్వ్యూలో తాజాగా సినిమాకి సంబంధించిన పలు విషయాలను తెలిపారు. సినిమా క్లైమాక్స్‌లో హీరోయిన్ వైష్ణవి చైతన్య వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు చూపిస్తారు.

baby-movie

హీరో ఆనంద్ హీరోయిన్ గురించిన ఆలోచనలతో తాగుతూ అలాగే ఉండిపోయినట్లు దర్శకుడు చూపించాడు. కానీ రెండవ హీరోగా నటించిన విరాజ్‌ను చూపించలేదు. ఆ విషయం గూర్చి అడుగగా, ‘క్లైమాక్స్‌లో విరాజ్‌ సన్నివేశాన్ని తీశాం. కానీ నిడివి పరంగా ఆ సీన్ ను తొలగించాల్సి వచ్చింది’ అని తెలిపారు. ఆ విధంగా చాలా సన్నివేశాలు కట్ చేశామని, వాటిని ఓటీటీలో చూపిస్తామని వెల్లడించారు.

తాజాగా ఈ చిత్రం AHA లో విడుదలైంది. ఒక సీన్ థియేటర్ లో రిలీజ్ అవ్వలేదు. కానీ ఓటిటి లో విడుదల చేసారు. ఆ సీన్ ఏంటో చూసేయండి.

watch video: