సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక స్టేజ్ కి వెళ్లేంతవరకు ఏదో ఒక రకమైన పనులు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఉన్న ఎంతో మంది సెలబ్రిటీలు ఇదే ఇండస్ట్రీలో వారు ఇప్పుడు చేసే పని కాకుండా అంతకుముందు మరొక రకమైన పని చేశారు.

Video Advertisement

ఇప్పుడు నటులు అయిన ఎంతో మంది అంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్లుగా చేశారు. అయితే ఇలా ఇప్పుడు భారతదేశంలోనే సెన్సేషన్ అయిన ఒక వ్యక్తి తలపతి విజయ్ హీరోగా నటించిన స్నేహితుడు సినిమాలో ఒక పాటలో ఒక చిన్న పాత్రలో నటించారు.

background actor in snehitudu now huge sensation

కానీ ఇప్పుడు వరుస పెట్టి హిట్ సినిమాలు చేస్తున్నారు. కమర్షియల్ సినిమాలకి పెట్టింది పేరు అయ్యారు. ఆయన ఎవరో కాదు డైరెక్టర్ అట్లీ. డైరెక్టర్ అట్లీ శంకర్ దర్శకత్వంలో వచ్చిన నన్బన్ సినిమాలో ఒక పాటలో ఒక చిన్న రోల్ లో కనిపించారు. విజయ్, ఇలియానా కనిపించే ఈ పాటలో ఒక చోట షూటింగ్ జరుగుతున్నట్టు చూపిస్తారు. ఇక్కడ క్లాప్ కొట్టే వ్యక్తి పాత్రలో అట్లీ కనిపిస్తారు. అట్లీ అంతకుముందు శంకర్ దగ్గర అసిస్టెంట్ గా చేశారు.

background actor in snehitudu now huge sensation

అలా ఎంతోమంది ప్రముఖ హీరోలతో పరిచయం ఉంది. రాజా రాణి సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఇంకొక విషయం ఏంటి అంటే అట్లీ దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. దాంతో అట్లీకి తెలుగులో కూడా చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. రాజా రాణి తర్వాత విజయ్ హీరోగా నటించిన పోలీసోడు సినిమాకి దర్శకత్వం వహించారు.

background actor in snehitudu now huge sensation

అప్పటివరకు విజయ్ ని ఒక రకంగా చూసిన ప్రేక్షకులకి ఈ సినిమా చాలా కొత్తగా అనిపించింది. విజయ్ కి చాలా మంచి సినిమా వచ్చింది అంటూ ఈ సినిమాని ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారు. ఆ తర్వాత విజయ్ తోనే మెర్సల్ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగులో అదిరింది పేరుతో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో విజయ్ త్రిపాత్రాభినయం చేశారు.

background actor in snehitudu now huge sensation

అలా అంచలంచెలుగా ఎదిగి ఇప్పుడు టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచారు. ఇటీవల ఒక ఈవెంట్ లో అట్లీ మాట్లాడుతూ “రోబో సినిమా షూటింగ్ టైంలో ముంబైలో ఉన్న షారుఖ్ ఖాన్ ఇల్లు అయిన మన్నత్ ముందు ఒక ఫోటో దిగి దాన్ని దాచుకున్నాను” అని, “కానీ ఇవాళ తన కారు లోపలికి వెళ్లడానికి అదే మన్నత్ డోర్లు తెరుచుకుంటున్నాయి” అని అన్నారు.

background actor in snehitudu now huge sensation

నిజంగా ఇది విన్నవారు అందరూ కూడా సక్సెస్ అంటే ఇదే అంటూ పొగుడుతున్నారు. అట్లీ ఒక తెలుగు హీరోతో సినిమా చేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని చాలా రోజుల క్రితమే ఒక వార్త వచ్చింది. దాంతో అట్లీ అల్లు అర్జున్ కి కథ వినిపించాను అనే విషయం చెప్పిన తర్వాత ఇప్పుడు అట్లీ నెక్స్ట్ అల్లు అర్జున్ తోనే సినిమా చేస్తారు అని అంటున్నారు.