ఒక సినిమాని తీసుకు రావడం అనేది నిజంగా పెద్ద యుద్ధమే. ప్రతి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా చిత్ర యూనిట్ చూసుకుంటూ సినిమాని తీసుకు రావాల్సి ఉంటుంది. సాంగ్స్ డాన్స్ మ్యూజిక్ ఇటువంటివన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది.

Video Advertisement

దర్శకులు ప్రతి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు. సినిమాని తెర మీద కి తీసుకు వచ్చే వరకు పలు విధాలుగా మార్పులు చేస్తూ ఉంటారు.

image sourced from : instagrm (Mani Deepu D)

హీరో హీరోయిన్ల ఎంపిక మొదలు ప్రతి చిన్న సైన్ ని ఎలా తీసుకు రావాలి అనేది జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు. ఇక ఈ మధ్య కాలంలో చాలా పాటల్లో ఎక్కువగా ఒక అతను కనబడుతున్నాడు. చాలా మంది ఫోకస్ పడింది. ఎవరబ్బా అని చాలా మంది ఆలోచిస్తున్నారు.. ఇతను చాలా పాటల్లో ఈ మధ్యన సైడ్ ని కనబడుతూ ఉంటున్నాడు. మరి ఇతను ఎవరో మీకు తెలుసా..? ఇతను ఎవరో కాదు మణిదీపు. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ పాటల్లో ఎక్కువగా మణి దీపు కనబడుతున్నాడు మణిదీపు పాటకి చాలా చక్కగా డాన్స్ వేస్తారు.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో డాన్సర్ గా మణిదీపు ఉంటున్నాడు. అలానే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా కూడా పని చేస్తున్నాడు మణి దీపు. మాస్ మహా రాజ రవితేజ శ్రీలీలా కాంబినేషన్ వచ్చిన ధమాకా సినిమాలో జింతాక్ పాట లో రవితేజ శ్రీ లీల కి మధ్య లో ఉంటాడు మణిదీపు. ధమాకా సినిమా రవి తేజ కి మంచి హిట్ ని ఇచ్చింది. చాలా రోజులకి రవి తేజ కి హిట్ లభించింది.

అలానే మణి దీపు ఆచార్య సినిమాలో రామ్ చరణ్ చిరంజీవి సాంగ్ లో కూడా కనబడతాడు. ఇలా ఈ మధ్య ఎక్కువగా మణి దీపు కనపడుతున్నాడు మరీ ముఖ్యంగా శేఖర్ మాస్టర్ పాటల్లో మణిదీపు ఎక్కువగా కనబడుతున్నాడు. స్టెప్పులు వేయడం అంటే మణిదీపు కి చాలా ఇష్టం. డాన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఇప్పుడు సినిమాల్లోకి వచ్చాడు పెద్ద స్టార్ల పక్కన స్టెప్పులు వేయడం మాములు విషయం కాదు.