“ఐశ్వర్యా రాయ్” పాటలో బ్యాక్‌గ్రౌండ్‌ డాన్సర్… ఇప్పుడు హీరో అయ్యి “సూపర్ హిట్స్” కొడుతున్నాడు..! ఎవరో తెలుసా..?

“ఐశ్వర్యా రాయ్” పాటలో బ్యాక్‌గ్రౌండ్‌ డాన్సర్… ఇప్పుడు హీరో అయ్యి “సూపర్ హిట్స్” కొడుతున్నాడు..! ఎవరో తెలుసా..?

by Anudeep

Ads

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. 2003 లో వచ్చిన ఇష్క్ విష్క్ చిత్రం తో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు షాహిద్. మొదట్లో రొమాంటిక్ పాత్రలు పోషించడంలో గుర్తింపు పొందిన షాహిద్ ఆ తర్వాత యాక్షన్ చిత్రాలు మరియు థ్రిల్లర్‌లలో పాత్రలు పోషించాడు మరియు మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా అనేక అవార్డులను అందుకున్నాడు. అయితే హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు షాహిద్ తన తండ్రి పంకజ్ కపూర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గ కూడా పని చేసాడు.

Video Advertisement

అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన షాహిద్ కి ఇదేం అంత ఈజీ గా రాలేదు. షాహిద్ తెరంగ్రేటం ముందుగా యాడ్స్ తో స్టార్ట్ అయింది. కాంప్లాన్ యాడ్ లో అయేషా టాకియా తో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. షారుఖ్ ఖాన్, కాజోల్, రాణి ముఖర్జీ తో కలిసి చేసిన కూల్ డ్రింక్ యాడ్ తో షాహిద్ కి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఐశ్వర్య రాయ్ నటించిన ‘తాళ్’, కరిష్మా కపూర్ నటించిన ‘దిల్ తో పాగల్ హై’ చిత్రాల్లోని సాంగ్స్ లో బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా పని చేసాడు. కొన్ని ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా షాహిద్ కనిపించాడు. చివరికి ‘ఇష్క్ విష్క్’ చిత్రం తో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు షాహిద్.

bollywood hero shahid kapoor journey..

అలాగే తాను పని చేసిన అందరి హీరోయిన్స్ తో షాహిద్ డేటింగ్ లో ఉన్నాడంటూ పలు రూమర్లు వచ్చేవి. ఇక 2015 లో షాహిద్ మీరా కపూర్ ని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం. వీరికి మిషా, జైన్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. షాహిద్ తల్లిదండ్రులు ఇద్దరు సినీ రంగానికే చెందిన వారు అయినా.. కెరీర్ లో నిలదొక్కుకోవడానికి షాహిద్ చాలా కష్టపడ్డాడు. 2006లో అమృతా రావుతో కలసి నటించిన వివాహ్ సినిమా హిట్ అయింది. ఆ తర్వాత 2013 లో వచ్చిన ఆర్.. రాజ్ కుమార్ సినిమా చిత్రం తో సూపర్ హిట్ కొట్టారు.

bollywood hero shahid kapoor journey..
ఇక ప్రస్తుతానికి వస్తే మూడేళ్ల క్రితం ప‌ద్మావ‌త్ వంటి భారీ విజ‌యం సాధించిన మూవీలో షాహిద్ నటించిన‌ప్ప‌టికీ.. ఆ స‌క్సెస్ ర‌ణ్‌వీర్ సింగ్, దీపికా ఖాతాలోకి ప‌డింది. దీంతో షాహిద్ క‌న్ను తెలుగు చిత్రాల‌పై ప‌డింది. తెలుగులో సూపర్ హిట్ అయినా అర్జున్ రెడ్డి చిత్రాన్ని అదే దర్శకుని తో ‘కబీర్ సింగ్’ గా తీసి సూపర్ హిట్ కొట్టాడు షారుఖ్. ఆ తర్వాత కూడా నాని జెర్సీ చిత్రాన్ని రీమేక్ చేయగా అది అక్కడి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ఇక తాజాగా షాహిద్ ‘రాజ్ & డీకే’ దర్శకత్వం లో వచ్చిన వెబ్ సిరీస్ ఫ‌ర్జీ లో నటించారు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ లో విజయ్ సేతుపతి, రాశి ఖన్నా కీలక పాత్రలు పోషించారు.


End of Article

You may also like