Ads
తెలంగాణ రాష్ట్రంలో పాతబస్తీ అంటే మజ్లిస్ అడ్డా.. అక్కడ ఎంఐఎం నాయకులు.. ముస్లిం అభ్యర్థులు తప్ప మరొకరు గెలిచే చాన్సే లేదు.ముస్లిం అభ్యర్థికి తప్ప అక్కడ వేరే ఒకరిని గెలిపించారు.ప్రతి ఎన్నికల వేళ తరచూ వినిపించే మాట ఇది. కానీ, పాతబస్తీలో వరుసగా మూడుసార్లు ఒక హిందువు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు.ఆయనే మాస్ లీడర్ బద్దం బాల్‌రెడ్డి. పాతబస్తీలో అంతర్భాగమైన కార్వాన్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు బీజేపీ తరపున శాసనసభకు ఎన్నికయ్యారు. బాల్‌రెడ్డి రికార్డును నాలుగు దశాబ్దాలుగా ఎవరు బద్ధలు కొట్టలేక పోయారు.
Video Advertisement
ఒకసారి ఆయన నేపథ్యం చూసుకుంటే బాల్‌రెడ్డిది హైదరాబాద్ పాతబస్తీలోని అలియాబాద్ ప్రాంతం. ఆయనకు విద్యార్థి దశలో జనసంఘ్‌లో పనిచేసిన అనుభవం ఉంది. 1977లో జనతా పార్టీలో చేరారు. అనంతరం భారతీయ జనతా పార్టీ ఏర్పాటుతో ఆ పార్టీలో కొనసాగారు.
అప్పట్లో కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని బీజేపీ అడ్డాగా మార్చడంలో బాల్ రెడ్డి కీలకపాత్ర పోషించారు.1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో కార్వాన్ నుంచి బకర్ అఘా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికలలో బీజేపీ నుంచి పోటీ చేసిన బద్దం బాల్‌రెడ్డి కార్వాన్ నియోజకవర్గంలో గెలుపొందారు . ఆ ఎన్నికల్లో ఎంఐఎం నుంచి పోటీ చేసిన విరాసత్ రసూల్ ఖాన్‌పై 9,777 ఓట్ల మెజార్టీతో గెలుపోందారు. అనంతరం 1989లో జరిగిన ఎన్నికల్లో బకర్ అగాపై 3,066 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 1994లో ఎంఐఎం అభ్యర్థి సయ్యద్ సజ్జాద్‌పై ఘన విజయం సాధించారు. ఈసారి ఆయనకు మెజార్టీ మరింత పెరిగింది. ఆ ఎన్నికల్లో 13,293 ఓట్లతో గెలుపొందారు.
ఇలా హ్యాట్రిక్ విజయాలు సాధించిన బాల్‌రెడ్డిని ఆయన అభిమానులు ‘కార్వాన్‌టైగర్’, ‘గోల్కొండ సింహం’ అని పిలుచుకుంటారు. వరుస విజయాల తర్వాత ఆయన మరోసారి శాసనసభకు ఎన్నిక కాలేకపోయారు. అయినప్పటికీ ఆయన నిరాశ చెందకుండా 2014 వరకు వరుసగా కార్వాన్‌లో పోటీ చేస్తూ వచ్చారు. 2014లో కార్వాన్ నుంచి పోటీ చేసి 48,614 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. చివరిసారిగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున రాజేంద్రనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి అక్కడా ఓడిపోయారు.
Also Read:రూ.100కే రైల్వేస్టేషన్ లో రూమ్ …ఎలా బుక్ చేసుకోవాలంటే…?
End of Article