బాహుబలి చిత్రం ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే .రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులోనే కాకుండా ఇతర భాషలన్నింటిలోనూ విజయం సాధించి మంచి పేరు తెచ్చుకుంది . దేశ విదేశాలలో కూడా ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిసింది .తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి పరిచయం చేసింది బాహుబలి .తెలుగు సినిమా చరిత్రను బాహుబలి కి ముందు బాహుబాలి తర్వాత అని రెండు భాగాలుగా విభజించారు.

Video Advertisement

ఈ సినిమాతోనే హీరో ప్రభాస్ క్రేజ్ తెలుగు రాష్ట్రాలను దాటి ప్రపంచ దేశాలకు విస్తరించింది .మ్యూజిక్ ,ఆర్ట్ డైరెక్షన్, గ్రాఫిక్స్ ఇలా అన్ని విభాగాలలోను ఈ చిత్రం తన సత్తాను చాటుకొంది ..కాగా ఈ చిత్రంలో ప్రభాస్ కు ప్రతినాయకుడిగా నటించిన రానా కు ,అలాగే రమ్యకృష్ణకు ఇతర నటీనటులకు కూడా మంచి పేరు తీసుకు వచ్చింది..అయితే అమరేంద్ర బాహుబలి చిన్నప్పటి  పాత్రను చేసిన ఆ బాలుడు మీకు ఇప్పుడు గుర్తున్నాడా ..ఇప్పుడు ఆ బాలుడు ఎలా ఉన్నాడో తెలుసా …వివరాల్లోకి వెళ్తే …

బాహుబలి చిత్రంలో ప్రభాస్ చిన్నప్పటి పాత్ర కోసం వేల మందిని పరిశీలించగా చివరకి ఆ అవకాశం దక్కింది మాత్రం నిఖిల్ దేవాదుల కు మాత్రమే . ఈ చిత్రంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మమతల తల్లి అనే పాటలో కనిపిస్తాడు నిఖిల్ దేవాదుల . ఈ చిత్రంలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు నిఖిల్ ..కాగా తాజాగా నిఖిల్ చిత్రాలు ఇంటర్నెట్లో దర్శనమిచ్చాయి ..
బాహుబలిలో బాల నటుడిగా నటించిన నిఖిల్ ఇప్పుడు అందంగా హీరోలా మారిపోయాడు ..కాగా అతని ఫొటోలకి సోషల్ మీడియాలో నెటిజన్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది ..తొందరలోనే హీరో అవుతాడు అని కొంతమంది తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు ..కాగా నిఖిల్ దేవాదుల హీరోగా ఒక చిత్రం మొదలవుతుంది అని ప్రస్తుతం ఆ సినిమాకి సంబందించిన కథ చర్చలలో ఉంది అని కొన్ని వర్గాల సమాచారం ..