బాలయ్య అన్ స్టాపబుల్ షో కి ప్రభాస్ వచ్చిన విషయం తెలిసిందే. మంచి హైప్ వున్న ఈ ఎపిసోడ్ ని ఆహా లో స్ట్రీమింగ్ చేయడం మొదలు పెట్టింది అయితే ఈ షో మొదలైన కాసేపటికి సర్వర్లు క్రాష్ అయిపోయాయి. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఎవరికీ యాప్ ఓపెన్ అవ్వలేదు.

Video Advertisement

ట్విట్టర్ వేదికగా ఆహా ఈ సంగతి చెప్పింది. ప్రభాస్ ఫ్యాన్స్ ప్రేమ కారణంగా యాప్ ఓవర్ లోడ్ అయ్యింది. ఫ్యాన్స్ ఎంత ట్రై చేసిన ఓపెన్ కాలేదు.

prabhas 1balayya

ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారం అవుతుంది. ప్రభాస్ ఇలాంటి టాక్ షో కి రావడం ఇదే మొదటి సారి. దీనితో అందరిలో ఆసక్తి ఎక్కువ అయ్యింది. ఎపిసోడ్‌కి సంబంధించి ఆహా రిలీజ్ చేసిన ప్రొమోలతోనే అందరిలో ఆసక్తి ఎక్కువ అయ్యింది. అయితే ఈ షో కి చూసేందుకు ఎక్కువ మంది రావడం వలన సైట్ క్రాష్ అయ్యింది. ఈ షో ఫస్ట్ పార్టీ ఆల్రెడీ వచ్చేసింది. రెండవ పార్ట్ అయితే జనవరి 6వ తేదీ నుంచి స్ట్రీమ్ కానుంది. దానిలో ప్రభాస్ తో పాటు గోపిచంద్ కూడా పాల్గొన్నాడు. ఇదిలా ఉంటే ఫస్ట్ ఎపిసోడ్ లో ప్రభాస్ గురించి మాట్లాడేందుకు రామ్ చరణ్ కి కాల్ చేస్తారు. అప్పుడు బాలయ్య ముందు నా సినిమా చూడు తరవాత మీ నాన్న గారి సినిమా చూడు అని చరణ్ తో చెప్తారు.

అయితే అప్పుడు ఎలా అయితే బాలయ్య తన సినిమా కోసం ప్రమోషన్స్ చేసుకున్నారో.. వీర సింహా రెడ్డి సినిమా గురించి పవన్ ద్వారా కూడా ప్రమోషన్స్ చేయించుకోనున్నారని టాక్. అయితే రాబోయే ఈ ఎపిసోడ్ ఇంకా బాగుంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే వీర సింహా రెడ్డి సినిమా లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. బాలయ్య 107 వ చిత్రంగా వీర సింహా రెడ్డి సినిమా రాబోతోంది.