‘బలగం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో కర్తానందం ఒకరు. ఆయన ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యారు. ‘బలగం’ చిత్రంతో గుర్తింపును సంపాదించుకున్నారు.

Video Advertisement

కర్తానందం తాజాగా ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి వెల్లడించారు. తనది సూర్యాపేట లోని కుతుబ్‌షాపురం అని, తన తండ్రి నల్గొండ జిల్లాలోని కేతెపల్లి గ్రామంలో స్థిరపడ్డారని తెలిపారు.  7వ తరగతి వరకు కేతెపల్లిలో చదువు సాగిందని అన్నారు. స్కూల్‌లో జరిగే సాంస్కృతిక ప్రోగ్రామ్స్ లో పాల్గొనేవాడినని, ఆ సమయంలోనే నటన మీద ఆసక్తి ఏర్పడిందని అన్నారు.
ఖమ్మంలో మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో 8-10 తరగతి వరకు చదువుకున్నానని వెల్లడించారు. అప్పుడు హాస్టల్‌లో ఉండేవాడినని చెప్పారు. హాస్టల్ బిల్డింగ్ ఓపెనింగ్‌ తాను నటించిన ‘ఏక్ దిన్ కా సుల్తాన్’ అనే నాటిక మంచి గుర్తింపును ఇచ్చిందని కర్తానందం వెల్లడించారు. ఇదే నాటకాన్ని మళ్ళీ హైదరాబాద్‌లో వేశానని, దానికి అప్పటి మినిస్టర్ మండలి వెంకటకృష్ణారావు ద్వారా అవార్డు అందుకున్నానని చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగలరావు చేతుల్లా మీదుగా కూడా అవార్డు తీసుకున్నట్టు తెలిపారు.
అనారోగ్యంతో తన తండ్రి మరణించడంతో తన తల్లి ఐదుగురు పిల్లల్ని బాగా చదివించిందని ఎమోషనల్ అయ్యారు. తోడబుట్టిన వారంతా సెటిల్ అయ్యారని వెల్లడించారు. తనకు ఇద్దరు కొడుకులని, వారి పేర్లు విశ్వ, విధాత అని చెప్పారు. తన వైఫ్ పేరు పావని అని, కొడుకులిద్దరూ బాగా చదువుతారని, తెలివైనవాళ్లని చెప్పారు. పెద్దబ్బాయి  జర్మనీలో ఎంఎస్ చేస్తున్నాడని, చిన్నబ్బాయి ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్ చేస్తున్నడని చెప్పారు.
తాను 22 సంవత్సరాలు హోంగార్డుగా పనిచేశానని అన్నారు. గతంలో నక్సలైట్లు కోయగూడేల్లోని యువతను ఆకర్షించకుండా చేయడానికి పోలీసులు కళాబృందాలను ఏర్పాటు చేసేవారని, తాను ఆ బృందంలో చేరి, హోంగార్డు అయ్యానని నటుడు కర్తానందం వెల్లడించారు.

Also Read: RAMA BANAM REVIEW : “గోపీచంద్” హీరోగా నటించిన రామబాణం హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!