ఒక స్టోరీని పోలిన స్టోరీతో ఉన్న సినిమాలు ఎన్నో వస్తాయి. ఈ కేటగిరీకి చెందిన సినిమాలని మనం లెక్క వేసుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అసలు ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు సినిమాలు అన్నీ ఒకటే స్టోరీ లైన్ మీద నడుస్తాయి. కానీ ప్రజెంటేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. అయితే దాదాపు అన్ని సందర్భాల్లోనూ అలా రెండు సేమ్ స్టోరీ లైన్లు ఉన్న సినిమాలు ఒకటేసారి విడుదల అవ్వడం అనేది జరగదు.

Balakrishna and Venkatesh movies with same story line released on the same date

కానీ ఎక్కడో కొన్ని సందర్భాల్లో మాత్రం ఇలాంటిది జరుగుతుంది. వివరాల్లోకి వెళితే. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా అశోక చక్రవర్తి. ఈ సినిమా మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ఆర్యన్ సినిమా రీమేక్. అశోక చక్రవర్తి సినిమా ని ఎస్.ఎస్ రవిచంద్ర గారు డైరెక్ట్ చేశారు. భానుప్రియ గారు సినిమాలో హీరోయిన్ గా నటించారు.

Balakrishna and Venkatesh movies with same story line released on the same date

ఈ సినిమాకి ఇళయరాజా గారు సంగీతం అందించారు. ఈ సినిమా 1989 లో జూన్ 29వ తేదీన విడుదల అయ్యింది.  అదేరోజు విక్టరీ వెంకటేష్ నటించిన ధ్రువ నక్షత్రం అనే సినిమా కూడా విడుదల అయ్యింది. ఈ సినిమాకి వై. నాగేశ్వరరావు గారు దర్శకత్వం వహించారు. ఇందులో రజిని గారు హీరోయిన్ గా నటించారు.ఈ సినిమాకి చక్రవర్తి గారు సంగీతం అందించారు.

Balakrishna and Venkatesh movies with same story line released on the same date

ఈ సినిమా మలయాళం సినిమా ఆర్యన్ ని ప్రేరణగా తీసుకుని తెరకెక్కించారు. ధ్రువ నక్షత్రం సినిమా కూడా 1989 లో జూన్ 29 వ తేదీన విడుదల అయ్యింది. రెండు సినిమాల స్టొరీ దాదాపు ఒకే లాగా ఉంటుంది. రెండు సినిమాలకి కూడా డైలాగ్స్ పరుచూరి బ్రదర్స్ రాశారు. అయితే ధ్రువ నక్షత్రం సినిమా సూపర్ హిట్ అవ్వగా, అశోక చక్రవర్తి సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇలా దగ్గర దగ్గర ఒకే స్టోరీ లైన్ ఉన్న రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అయ్యాయి.

Balakrishna and Venkatesh movies with same story line released on the same date