సిల్క్ స్మిత పేరు వినని వారెవ్వరు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.అంతలా ఫేమస్ అయిన సిల్క్ స్మిత శృంగార తారగా పేరు తెచ్చుకున్నారు.రజినీకాంత్ ,కమల్ హాసన్ ,చిరంజీవి,బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సరసన నటించారు.తెలుగు తమిళ మలయాళ,కన్నడ ,హిందీ తో పటు పలు భాషల్లో 450 కి ఓపైగా చిత్రాల్లో నటించి అందరిని మెప్పించారు .

balakrishna

ఆమె ఆడితే 369 సినిమాతో మంచి నటి గా గుర్తింపు పొందారు.ఇటీవలే ఈ చితం ౩౦ సం పూర్తి చేసుకుంది . ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను బాలకృష్ణ పంచుకుంటూ సిల్క్ స్మిత గురించి మాట్లాడారు . “సిల్క్ స్మిత మేకప్, కాస్ట్యూమ్ విషయాలలో ఆవిడని మించిన వారు లేరు అని, ఈ విషయం లో ఆవిడని కొట్టిన ఆడది లేదు” అంటూ మాట్లాడారు.శ్రీదేవి లాంటి పెద్ద హీరోయిన్స్ కూడా సిల్క్ స్మిత మేకప్, కాస్ట్యూమ్ ఫాలో అవుతూ ఇమిటేట్ చేసేవారు అని చెప్పుకొచ్చారు. సిల్క్ స్మిత డాన్సర్ అయినప్పటికి తనని పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా అనుసరించడం అంటే అదేమీ చిన్న విషయం కాదు అంటూ సిల్క్ స్మిత పై ఉన్న అభిప్రాయాన్ని చెప్పుకొస్తూ ఆమెను ప్రశంసించారు.