Ads
గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి కూడా మోకాలి లోతు వరకు నీళ్లు చేరి ప్రజలందరూ ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలను కాపాడడానికి, అలాగే వారికి తగిన సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది.
Video Advertisement
ఇలాంటి కష్ట పరిస్థితులలో తమ వంతు సహాయం చేయడానికి సినీ పరిశ్రమ కూడా ముందుకి వచ్చింది. నందమూరి బాల కృష్ణ కూడా తన వంతు సహాయంగా 1.5 కోట్ల రూపాయలను అందించారు. కానీ ఈ విషయం గురించి ఎక్కడా ప్రకటించలేదు. దాంతో ఈ వార్త ఎవరికీ తెలియలేదు.
అంతే కాకుండా చాలా సంవత్సరాల క్రితం బాల కృష్ణ స్వీయ దర్శకత్వంలో నర్తనశాల సినిమా మొదలైంది. కొంత షూటింగ్ కూడా జరిగింది. షూటింగ్ మధ్యలో ఉన్నప్పుడు ఈ సినిమాలో ద్రౌపది పాత్ర పోషిస్తున్న సౌందర్య ప్లేన్ ప్రమాదంలో మరణించారు.
షూటింగ్ జరుపుకున్న 17 నిమిషాల సినిమా దసరాకి శ్రేయాస్ ఈటీ ద్వారా ఎన్ బీ కే థియేటర్ లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా చూడాలంటే కొంత మొత్తం (పే పర్ వ్యూ) చెల్లించాలి. అలా వచ్చిన మొత్తంలో సగం చారిటీ కి వెళ్తుంది అని బాలకృష్ణ ప్రకటించారు.
నర్తనశాల లో అర్జునుడిగా బాల కృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడు గా శ్రీ హరి, ధర్మ రాజుగా శరత్ బాబు నటించారు. ఈ సినిమాలో బాల కృష్ణ, సౌందర్య, శ్రీ హరి పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇటీవల విడుదలయ్యాయి.
End of Article