బాలయ్య బోయపాటి శ్రీను మూవీ అలా ఉండబోతుందా..?

బాలయ్య బోయపాటి శ్రీను మూవీ అలా ఉండబోతుందా..?

by kavitha

Ads

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన బ్లాక్ బస్టర్ ‘నరసింహ నాయుడు’ మూవీ రీరిలీజ్ చేశారు. అలాగే బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న ‘భగవంత్ కేసరి’ మూవీ నుండి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.

Video Advertisement

బాలయ్య బోయపాటి శ్రీను కాబినేషన్ లో ఇప్పటికే రావలసిన మూడవ చిత్రం వివిధ కారణాలతో ఆలస్యమైంది. అయితే వీరి కాంబోలో రాబోతున్న మూవీ బాలకృష్ణ హిట్ చిత్రాలలో ఒకదానికి సీక్వెల్ అని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు నందమూరి ఫ్యాన్స్ అఖండ-2 మూవీని తెరకెక్కించాలని కోరుకుంటున్నారు. ఆ మూవీని కూడా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించాలని అభిమానులు భావిస్తున్నారు.
Balakrishna-Boyapati-Srinu-3ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిన పరవాలేదని కానీ విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అఖండ సినిమాని బాలీవుడ్ లో రిలీజ్ చేసినా, అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేదనే విషయం తెలిసిందే. బాలకృష్ణకు పాన్ ఇండియా స్థాయిలో బోయపాటి శ్రీను హిట్ ఇస్తే తమ ఆనందానికి అవధులు ఉండవని ఫ్యాన్స్  కామెంట్లు చేస్తున్నారు.
బాలకృష్ణ బోయపాటి శ్రీను కలయికలో వచ్చే మూవీ రికార్డులు సృష్టించడం ఖాయమని కామెంట్స్ వినిపిస్తున్నాయి.  బాలయ్య పారితోషికం 25 కోట్ల రేంజ్ లో ఉంది. బోయపాటి పారితోషికం 15 కోట్ల రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక  బాలయ్య చిత్రాలను తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చే సినిమా వచ్చే ఏడాది మేలో సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది. ఈ చిత్రం  మాస్ ఆడియెన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా హక్కులను పొందాలని డిస్ట్రిబ్యూటర్లు చాలా మంది భావిస్తున్నారు. బాలకృష్ణను అభిమానించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

Also Read: బాలకృష్ణ కొడుకు “మోక్షజ్ఞ” కొత్త లుక్ ఫోటో చూశారా..? ఎంత మారిపోయాడో కదా..?


End of Article

You may also like