బాబాయ్ అంటే “బాలకృష్ణ” లాగానే ఉండాలి అనుకుంటా..! తారకరత్న హాస్పిటల్ లో ఉన్నప్పుడు..?

బాబాయ్ అంటే “బాలకృష్ణ” లాగానే ఉండాలి అనుకుంటా..! తారకరత్న హాస్పిటల్ లో ఉన్నప్పుడు..?

by Anudeep

Ads

నందమూరి తారకరత్న మరణవార్త తెలుగురాష్ట్రాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. అయితే ఇన్ని రోజులు అతడిని కాపాడుకుంటూ వచ్చాడు బాబాయ్ బాలకృష్ణ. బాలయ్య మాట కాస్త కటువుగా ఉంటుంది.. మనసు మాత్రం వెన్న అని తెలిసిన వారు చెబుతూ ఉంటారు. ఇప్పటి వరకు అందరికి బాలకృష్ణ అంటే ఒక కోపిష్టి, అభిమానులపై చేయి చేసుకుంటాడు, ఏదేదో మాట్లాడుతాడు అనే తెలుసు.

Video Advertisement

కానీ గత 23 రోజులుగా తన అన్న కొడుకు కోసం బాలయ్య పడిన తపన చూశాక.. అందరూ ఆయనలోని మంచితనానికి ఫిదా అవుతున్నారు. ఇంత మంచి బాబాయిని పొందిన తారకరత్న అదృష్టవంతుడనుకుంటున్నారు. సినిమాల్లో రాణించలేకపోయేసరికి.. రాజకీయాల వైపు వద్దాం అనుకున్నారు తారక్ రత్న..అందుకే ఇటీవల టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ లోపే అనర్థం జరిగిపోయింది. కెరీర్ విషయంలో తారకరత్నది బ్యాడ్ లక్ కావొచ్చేమో గానీ.. బాబాయి బాలకృష్ణ ప్రేమకు పాత్రుడు కావడం మాత్రం నిజంగా అతడి అదృష్టం.

balakrishna love towards taraka ratna..!!

తారకరత్న అంటే బాలయ్యకు ఎంతో ఇష్టం. తన అన్న కొడుక్కి గుండెపోటు వచ్చి కుప్పకూలాడు అని తెలియగానే బాలయ్య తల్లడిల్లాడు. కుప్పం నుంచి బెంగళూరు‌ నారాయణ హృదయాలయలో చేర్పించే వరకూ బాలయ్య విశ్రమించలేదు. హస్పిటల్‌లో డాక్టర్లతో తరచుగా మాట్లాడుతూ.. మెరుగైన చికిత్స అందేలా బాలయ్య జాగ్రత్తలు తీసుకున్నారు. ఇన్ని రోజులుగా తరచూ బెంగళూరు వెళ్తూనే ఉన్నారు బాలకృష్ణ. తారకరత్న క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ.. చిత్తూరు జిల్లా బత్తలాపురంలోని మృత్యుంజయ స్వామి ఆలయంలో అఖండ జ్యోతిని వెలిగించారు.

balakrishna love towards taraka ratna..!!

తారకరత్న ఆరోగ్యవంతుడై తిరిగి రావడం కోసం బాలయ్య చేయని ప్రయత్నం లేదు. తారకరత్న కోసం బాలకృష్ణ ఎంత తపించారో చెప్పడానికి ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. తారకరత్న భార్యా, పిల్లల బాధ్యత తాము తీసుకుంటామని బాలకృష్ణ తనకు హామీ ఇచ్చారన్నారు. తారకరత్న పార్థీవ దేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చాక.. అతడి కూతురు భోరుమని ఏడ్చింది. బాలయ్య తాతా.. నాన్న లేవడం లేదు చూడంటూ.. పరిగెత్తుకుని వెళ్లి బాలకృష్ణను హత్తుకొని కన్నీరు కార్చింది. అంత కష్టంలోనూ బాలయ్య నవ్వుతూ ఆ చిన్నారిని ఓదార్చాడు.

what is the reason for taraka ratna death..!!

ఇలాంటి సమయంలో ఆ చిన్నారి తన సొంత తాత దగ్గరకు కాకుండా.. చిన తాత దగ్గరకు వెళ్లడాన్ని బట్టి తారకరత్న పిల్లలకు బాలయ్యతో ఉన్న అనుబంధాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాగే అంత్యక్రియల సమయం లోను తన అన్న మోహనకృష్ణకు ముందు నడుస్తూ.. చితి చుట్టూ తిరిగారు బాలకృష్ణ. ఇన్ని రోజులుగా బాలయ్య వేదనని చూసిన అందరికి తారకరత్న పట్ల బాలయ్యకు ఎంత ప్రేమ ఉందనేది మాత్రం అర్థమైంది. అలాగే తారక రత్నకి బాబాయ్ బాలకృష్ణ అంటే ప్రాణం కన్నా మిన్న. బాబాయ్ పై అంత ప్రేమ కురిపిస్తాడు. బాలకృష్ణ అంటే ఒక సింహం లాంటి మనిషి. కాబట్టి సింహం బొమ్మని టాటూగా వేయించుకుని దాని కింద బాలకృష్ణ సంతకాన్ని కూడా టాటూగా వేయించుకున్నాడు.

 


End of Article

You may also like