సంక్రాంతికి కానుకగా బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. వీర సింహారెడ్డి పాత్ర బాల కృష్ణ కి సరిగ్గా సరిపోయింది. అలానే బాలకృష్ణ సరసన శృతిహాసన్ నటించిన ఈ సినిమాలో ఎమోషన్స్ సీన్స్, పాటలు, కొన్ని యాక్షన్ సీన్స్ ఇవన్నీ కూడా ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేశాయి.

Video Advertisement

ఈ సినిమాకి గోపీచంద్ మల్లిని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ వంటి స్టార్లు కూడా కీలక పాత్రలు పోషించారు.

who is the winner of this pongal..

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎలమంచిలి రవి, నవీన్ ఎర్నేని ఈ సినిమాని నిర్మించారు. తమన్ సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలైనప్పుడు నెగిటివ్ టాక్ వచ్చింది కానీ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ మాత్రం ఇంకొక విధంగా ఉంది. అనుకున్నట్టుగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాన్ని సొంతం చేసుకుని, విమర్శకుల అంచనాలకు భిన్నంగా ఈ సినిమా
టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ని కూడా ఫిక్స్ చేశారు.

reasons for veera simha reddy negative talk

ఇక ఆ విషయానికి వస్తే.. ఓటీటీ లో ఈ నెల 21వ తేదీన ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవ్వనుంది. చాలా మంది ఓటిటి లో ఈ సినిమా ఎప్పుడు వస్తుంద అని కూడా చూస్తున్నారు. పైగా కొందరు థియేటర్ లో మిస్ అయిన వాళ్లు కూడా ఉండొచ్చు వాళ్ళు కూడా ఓటిటి లో చూసేందుకు ఎదురు చూస్తున్నారు.

veera simha reddy final result..!!

ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్స్క్రైబర్లు ని కూడా పెంచుతుందని భావిస్తున్నారు. ఓటిటిలో కూడా మంచి ఫలితాలను ఈ సినిమా సొంతం చేసుకుంటుందని అంటున్నారు. వీర సింహారెడ్డి మూవీ కి కూడా అఖండ లాగే ఓటీటీ లో సూపర్ రెస్పాన్స్ వస్తుందని చూస్తున్నారు. మరో పక్కన నెట్ ఫ్లిక్స్ లో వాల్తేరు వీరయ్య సినిమా త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.