Home Filmy Adda అప్పుడు మహేష్… ఇప్పుడు పవన్..? అదే రిపీట్ అవుతోందా..??

అప్పుడు మహేష్… ఇప్పుడు పవన్..? అదే రిపీట్ అవుతోందా..??

by Anudeep

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా అందిస్తోన్న సెలబ్రిటీ టాక్‌ షో అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే మొదటి సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, నేచురల్ స్టార్ నాని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజ రవితేజ, దర్శకధీరుడు రాజమౌళి తదితర సెలబ్రిటీలతో ఈ ఛాట్‌షోలో బాలయ్య చేసిన సందడి అంతా ఇంతా కాదు. అన్‌స్టాపబుల్ షో తో బాలకృష్ణలోని మరో కోణం ప్రేక్షకులకు తెలిసొచ్చింది. ఈ షోలో ఎంతో ఈజ్‌తో చేసి హోస్ట్‌గా కెవ్వు కేక పుట్టించారు.

 

మొదటి ఎపిసోడ్ లో తన బావ, మాజీ ముఖ్య మంత్రి అయినా చంద్ర బాబు గారితో స్టార్ట్ చేసి షాక్ ఇచ్చారు బాలయ్య.
ఇక రెండో ఎపిసోడ్ లో యంగ్ హీరోస్ విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డలతో పాటు యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ కూడా వచ్చినట్లుగా ప్రోమోలో చూపించారు. ఇక ఇదే వీడియోలో ఈ సారి అన్‌స్టాపబుల్ షోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నట్లు హింట్ ఇచ్చారు బాలకృష్ణ.

balakrishna planning the same thing for unstopable 2..??
అయితే అప్పుడే బాలకృష్ణ త్రివిక్రమ్ కు ఫోన్ చేశాడు. బాలయ్య ఫోన్ చేయగానే షోకు ఎప్పుడు వస్తున్నారు అని అడగ్గానే.. మీరు ఎప్పుడు అంటే అప్పుడు అని త్రివిక్రమ్ చెప్పాడు. ఇక అందుకు బాలయ్య ఎవరితో రావాలో తెలుసుగా అని కూడా అనేశాడు. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది.

balakrishna planning the same thing for unstopable 2..??
ఫస్ట్ సీజన్ ను మహేష్ బాబు ఎపిసోడ్ తో ముగించినట్లు ఈ సీజన్ లో పవన్ కళ్యాణ్ తో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ టాక్ షోలలో పాల్గొన్న దాఖలాలు లేవు. బాలయ్య అన్‌స్టాపబుల్‌కి హాజరైతే మాత్రం ఆయన ఫ్యాన్స్‌కి పండగే. ఓ వైపు షూటింగ్ లు, మరోవైపు పార్టీ పనులతో బిజీగా ఉండే పవన్ కల్యాణ్ దీని కోసం కోసం సమయం కేటాయిస్తారో లేదో చూడాలి.

You may also like