బాలకృష్ణ “సింహ” సినిమాలోని ఈ సీన్ ని… సేమ్-టు-సేమ్ దింపేశారుగా…? ఏ సినిమా నుండి అంటే..?

బాలకృష్ణ “సింహ” సినిమాలోని ఈ సీన్ ని… సేమ్-టు-సేమ్ దింపేశారుగా…? ఏ సినిమా నుండి అంటే..?

by Mounika Singaluri

Ads

సౌత్ సినిమాలపై విషం చిమ్మడం ఆపడంలేదు నార్త్ జనాలు. బాలీవుడ్ డౌన్ అవ్వడం.. సౌత్ సినిమాలు సత్తా చాటుతుండటంతో.. వారికి అది మింగుడు పడటంలేదు. సౌత్ సినిమాకు..ముఖ్యంగా.. తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం వాళ్ళు భరించలేకపోతున్నారు.

Video Advertisement

తెలుగు సినిమాలపై బాలీవుడ్ తో పాటు.. హాలీవుడ్ నుంచి కూడా వరుసగా ప్రశంసలు దక్కాయి. రాజమౌళి విసువల్ వండర్స్ చేస్తూ సౌత్ సినిమాను పైకి లేపుతున్న క్రమంలోనే.. ఆటోమాటిక్ గా బాలీవుడ్ సినిమా డౌన్ అయిపోయింది. ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అనే వరకూ వచ్చింది. దాంతో బాలీవుడ్ లో ఒక వర్గం జనాలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాగైనా సౌత్ సినిమాను ఇబ్బందుల్లోకి నెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. కొంత మంది నెటిజన్లు ఎప్పుడూ అదే పనిలో ఉంటున్నారు.

simha cinema scenes cpoied from english movie
ఆర్ ఆర్ ఆర్ తో సహా పలు సూపర్ హిట్ తెలుగు సినిమా లోని కొన్ని సీన్స్ ను తీసుకొని వాటిని హాలీవుడ్ లోని చిత్రాల నుంచి కాపీ కొట్టారంటూ వీడియోలు చేసి సోషల్ మీడియాల్లో విస్తృతం గా షేర్ చేస్తున్నారు. అందులో 2010 లో బాలకృష్ణ, బోయపాటి కంబోయినషన్ లో వచ్చిన ‘సింహా’ సినిమాలో కొన్ని సీన్లను కూడా అందులో పెట్టారు. హీరోయిన్ స్నేహ ఉల్లాల్ ను పెట్రోల్ బంక్ నుంచి విలన్లు తీసుకెళ్లే సీన్ నుంచి బాలయ్య వాళ్ళను చేస్ చేసే సీన్ వరకు 2006 లో జాన్ సేనా నటించిన ‘ది మెరైన్’ చిత్రంలో నుంచి కాపీ కొట్టారంటూ వైరల్ చేస్తున్నారు.

balakrishna simha movie scenes copied from a hollywood movie

ఈ సీన్లను చూసిన కొందరు మాత్రం సేమ్ టు సేమ్ కాపీ కొట్టారు గా అని కామెంట్లు చేస్తుండగా.. మరి కొందరు మాత్రం మంచి సినిమాల్లోని సీన్లను ఇన్స్పిరేషన్ గా తీసుకోవడంలో తప్పు లేదుగా అంటున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వరల్ అవుతున్నాయి. వీటిని సపోర్ట్ చేస్తూ.. కొంత మంది ఈ వీడియోలు శేర్ చేస్తుండగా.. మరికొంత మంది.. ఈ విమర్షలను కొట్టి పారేస్తున్నారు.. ఇటువంటి పద్దతి మంచిది కాదంటూ కామెంట్లు పెడుతున్నారు.

watch video :


End of Article

You may also like