బాలయ్య అన్ స్టాపబుల్ షో కి క్రేజ్ మాములుగా లేదు. ప్రభాస్ వచ్చినప్పటి నుండి అన్ స్టాపబుల్ షో పాపులారిటీ మరెంత పెరిగి పోయింది. కానీ ఆహా లో స్ట్రీమింగ్ చేయడం మొదలు పెట్టిన కొంచెం సేపటికే సర్వర్లు క్రాష్ అయిపోయాయి. ఎంత మంది ఎన్ని సార్లు ట్రై చేసినా సరే యాప్ ఏ ఓపెన్ కాలేదు. ఆహా ట్విట్టర్ లో సర్వర్లు క్రాష్ అయిపోయాయి అని తెలిపింది. ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా ప్రసారం అవుతోంది. మొదటి భాగం ఇప్పటికే వచ్చేసింది.

Video Advertisement

ఫ్యాన్స్ కూడా ప్రేమ ని చూపారు. ఇదిలా ఉంటే సెకండ్ పార్ట్ జనవరి 6వ తేదీ నుంచి స్ట్రీమ్ కానుంది. దాని కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

questions balakrishna asked pawan kalyan in unstoppable with nbk

గోపిచంద్ కూడా ప్రభాస్ తో ఈ షో లో పాల్గొంటున్నాడు. అలానే బాలయ్య షో కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షో వస్తున్నట్లు ఆహా ఇప్పటికే చెప్పింది. అయితే ఈ షో ఇప్పుడు ఇప్పుడే రాకపోవచ్చు. జనవరి 12న వీర సింహారెడ్డి స్పెషల్ ఎపిసోడ్ వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్ల కోసం ఈ ఎపిసోడ్ ని తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది సో ఇప్పుడు వీర సింహా రెడ్డి ప్రమోషన్స్ కోసం ఒక స్పెషల్ ఎపిసోడ్ ఉంటుంది కాబట్టి సంక్రాంతి తర్వాతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఉండబోతున్నట్లు టాక్.

ఇది ఇలా ఉంటే కేటీఆర్, రామ్ చరణ్ తేజ్ తో కలిసి ఒక ఎపిసోడ్ చేయబోతున్నారు. అయితే మరి ఆ ఎపిసోడ్ కూడా ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. ఇంకా దీని గురించి క్లారిటీ ఇవ్వలేదు. రామ్ చరణ్ కేటీఆర్ కలిసి రావడం ఆసక్తికరంగా ఉంటుంది. పైగా వీళ్ళు ఎటువంటి విషయాలు మాట్లాడతారు అనేది కూడా అందరిలో మెదులుతున్న ప్రశ్న. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ బాలకృష్ణ ప్రమోషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది మరింత లేటుగా వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు అభిమానులు ఎదురు చూడవలసిందే.