సినిమాకి సంబంధం లేకపోయినా.. ఆ పాట ఎందుకు..? “వీర సింహా రెడ్డి” పై కామెంట్స్..!

సినిమాకి సంబంధం లేకపోయినా.. ఆ పాట ఎందుకు..? “వీర సింహా రెడ్డి” పై కామెంట్స్..!

by kavitha

Ads

Tollywood: బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వీరసింహారెడ్డి’ నుంచి బుధవారం న్యూ అప్‌డేట్ ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్. ‘రాజసం నీ ఇంటిపేరు’ అని కొత్త పోస్టర్‌ను ట్విట్టర్లో వదిలారు. దీనిలో బాలయ్య వింటేజ్ లుక్‌లో కనిపిస్తున్నారు.

Video Advertisement

అయితే ఈ పోస్టర్ లో ‘జై బాలయ్య’అనే పాటను నవంబర్ 25న రిలీజ్ చేస్తున్నామని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే ఇక్కడే చాలామందికి ఒక పాట ఎందుకు పెట్టినట్టు అని  సందేహం వచ్చింది. జై బాలయ్య అనేది సినిమాలో హీరో పేరు కాదు. పోనీ సినిమా పేరనుకుంటే అది కూడా కాదు. మరి ఈ జై బాలయ్య పాటను ఎందుకు పెట్టరా అని అనుకుంటున్నారు. ఇపుడే కాదు ఇంతకు ముందు అఖండ మూవీలో కూడా జై బాలయ్యతో ఒక పాట పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే మైత్రీ మూవీ మేకర్స్ ఇటు మెగాస్టార్ అభిమానులకు ఇటు నందమూరి అభిమానులకు వరుస అప్డేట్స్ ఇచ్చారు. నిన్న ‘వాల్తేరు వీరయ్య’ నుండి ‘బాస్ పార్టీ’ పాటను విడుదల చేశారు. ఇంకో రెండు రోజుల్లో ‘వీరసింహారెడ్డి’ నుండి ‘జై బాలయ్య’ పాటను విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు బుధవారం ఒక అప్‌డేట్ ఇచ్చింది. ‘రాజసం నీ ఇంటిపేరు’ అనే ఒక కొత్త పోస్టర్‌ను వదిలింది. బాలయ్య ఈ పోస్టర్‌లో వింటేజ్ లుక్‌లో కనిపిస్తున్నారు. నందమూరి అభిమానులకు సంతోషాన్ని ఇస్తోంది. బాలకృష్ణ హీరోగా వస్తున్న ‘వీరసింహారెడ్డి’ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ‘జై బాలయ్య’ రాబోతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకం పై గోప్‌చంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావడానికి సిద్ధమవుతోంది. వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ హైదరాబాద్‌‌లో జరుగుతోంది. మైత్రీ మేకర్స్ ఈ మూవీ గురించి అప్‌డేట్స్ ఇస్తూ మూవీ పై అంచనాలను ఎప్పటికప్పుడు పెంచుతున్నారు. తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ చేయడానికి సిద్ధం అయ్యారు. ‘జై బాలయ్య’నవంబర్ 25న ఉదయం 10:29 గంటలకు విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా ‘రాజసం నీ ఇంటి పేరు’ అని పేర్కొంటూ నిర్మాతలు ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో బాలకృష్ణ లుక్ ఫ్యాన్స్‌ను మంత్రముగ్ధుల్ని చేసేలా ఉంది. వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో ట్రాక్టర్ నడుపుతూ రాయల్‌గా కనిపించారు బాలకృష్ణ. ‘సమరసింహారెడ్డి’ టైమ్‌లో బాలయ్యలా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


End of Article

You may also like