• చిత్రం : వీర సింహా రెడ్డి
 • నటీనటులు : నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోజ్, దునియా విజయ్.
 • నిర్మాత : నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
 • దర్శకత్వం : గోపీచంద్ మలినేని
 • సంగీతం : తమన్
 • విడుదల తేదీ : జనవరి 11, 2023

veera simha reddy movie review

Video Advertisement

స్టోరీ :

జై (బాలకృష్ణ) టర్కీలో ఒక కార్ డీలర్ షిప్ నడుపుతూ ఉంటాడు. తన తల్లి మీనాక్షితో కలిసి అక్కడే ఉంటాడు. అక్కడే ఇస్తాంబుల్ లో ఉండే సంధ్య (శృతి హాసన్) ని చూసి జై ప్రేమిస్తాడు. సంధ్య తండ్రి జై తల్లితండ్రులని కలవాలి అని చెప్తాడు. దాంతో అక్కడికి వీర సింహా రెడ్డి (బాలకృష్ణ) వెళ్తాడు. అప్పుడే జై తన తండ్రిని మొదటిసారి కలుస్తాడు. కానీ వీర సింహా రెడ్డికి గతం ఉంటుంది. దానివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాడు. అసలు ఈ వీర సింహారెడ్డి ఎవరు? అతను ఎక్కడనుండి వచ్చాడు? అతని సమస్య ఏంటి? భానుమతి (వరలక్ష్మి శరత్ కుమార్) కి, వీర సింహా రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి? జై తన తండ్రిని కాపాడగలిగాడా? ఇదంతా తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

veera simha reddy movie review

రివ్యూ :

ఈ సినిమాకి సంబంధించి పోస్టర్ వచ్చినప్పటి నుంచి కూడా సినిమాపై ప్రేక్షకులకి ఆసక్తి పెరుగుతూనే ఉంది. ఈ సినిమా కూడా ఒక మంచి యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ అవుతుంది అని అనుకుంటున్నారు. ఇందులో బాలకృష్ణ మళ్ళీ రెండు పాత్రలో నటిస్తున్నారు అనగానే కచ్చితంగా హిట్ అవుతుంది అని అనుకున్నారు. ట్రైలర్ చూడంగానే ఇలాంటి సినిమాలు మనం అంతకుముందు చూసాము కదా అని కామెంట్స్ కూడా వచ్చాయి.

veera simha reddy movie review

సినిమా చూసిన తర్వాత కథపరంగా పెద్దగా కొత్తగా ఏమీ లేదు అనిపిస్తుంది. నిజంగానే అంతకుముందు మనం ఇలాంటి సినిమాలు చాలా చూసాం. అది కూడా అందులో చాలా వరకు బాలకృష్ణ సినిమాలే ఉన్నాయి. ఇప్పుడు కూడా బాలకృష్ణ తనకి బాగా కలిసి వచ్చిన ఫార్ములాతో సినిమా తీశారు. బాలకృష్ణకి వీర సింహారెడ్డి పాత్ర చాలా బాగా సరిపోయింది అనిపిస్తుంది. ఆ పాత్రకి ఉన్న గంభీర్యం బాలకృష్ణ చాలా సహజంగా తెరపై చూపించారు. శృతి హాసన్ కి పెద్దగా చెప్పుకోవడానికి గుర్తుండిపోయే అంత మంచి పాత్ర ఏమి లేదు.

veera simha reddy movie review

సినిమాకి హైలైట్ అయిన మరొక పాత్ర వరలక్ష్మి శరత్ కుమార్. ఇలాంటి పాత్ర చేయడం, అలాగే సొంత డబ్బింగ్ చెప్పుకోవడం నిజంగా అభినందించాల్సిన విషయం. వీరు మాత్రమే కాకుండా మరొక ముఖ్య పాత్రలో నటించిన హనీ రోజ్, విలన్ పాత్రలో నటించిన దునియా విజయ్ కూడా బాగా నటించారు. పాటలు చూడడానికి, వినడానికి బాగానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా కమర్షియల్ సినిమాలకి ఉన్నట్టే ఉంది. అలాగే మధ్యలో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ కూడా ఏదో బలవంతంగా ఇరికించినట్టు అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

 • వీర సింహారెడ్డి ఎపిసోడ్
 • కొన్ని యాక్షన్ సీన్స్
 • పాటలు
 • ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్:

 • రొటీన్ స్టోరీ
 • ఇరికించినట్టు ఉండే కామెడీ సీన్స్
 • శృతి హాసన్ పాత్ర
 • ఫస్ట్ హాఫ్ లో సాగదీసినట్టు ఉండే కొన్ని సీన్స్

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

స్టోరీ నుండి పెద్దగా ఏమీ ఆశించకుండా కేవలం బాలకృష్ణ కోసం మాత్రమే, అలాగే సినిమాలో ఉండే కొన్ని యాక్షన్ సీన్స్ కోసం సినిమా చూడాలి అనుకుంటే వీర సింహా రెడ్డి సినిమా ఒక్కసారి చూసే కమర్షియల్ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది.

watch trailer :