ఆ రెమ్యూనరేషన్ ని విరాళంగా ఇచ్చిన బాలయ్య….ఎంతైనా బాలయ్య మనసు బంగారం!

ఆ రెమ్యూనరేషన్ ని విరాళంగా ఇచ్చిన బాలయ్య….ఎంతైనా బాలయ్య మనసు బంగారం!

by Mounika Singaluri

ఈ వయసులో కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీని ఇస్తూ హిట్ల మీద హిట్లు తన ఖాతాలో వేసుకుంటున్నాడు బాలయ్య బాబు. ఆయన జోష్ కి కుర్రకారు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఆయన యాక్టింగ్ ఇరగ తీయటంలోనే కాదు విరాళాలు ఇవ్వటంలో కూడా ఎక్కడ తగ్గడం లేదు. నందమూరి నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలకృష్ణ ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకొని టాప్ హీరోగా ఎదిగిన వైనం అందరికీ తెలిసిందే. ఈ వయసులో ఆయన హ్యాట్రిక్ కొట్టారు అంటే అది మామూలు విషయం కాదు.

Video Advertisement

అలాగే బాలయ్య బాబు ఇంతకుముందు నటన మీద మాత్రమే దృష్టిని పెట్టేవారు. దాని ద్వారా మాత్రమే అతని సంపాదన ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం యాడ్ చేయటానికి, బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటానికి కూడా ఒప్పుకుంటున్నారు దాని ద్వారా మరింత ఆదాయం పొందుతున్నారు. కొన్ని నెలల క్రితం వెగా జువెలర్స్ అంటూ ఒక జువెలరీ బ్రాండ్ కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడమే కాదు దానికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా నటించాడు. ఇంకేముంది బాలయ్య బాబు ప్రచారం చేసేసరికి జువెలరీ బిజినెస్ గట్టిగా ఊపు అందుకుంది.

ఈ నేపథ్యంలో మరో యాడ్లో నటించటానికి బాలయ్య ఒప్పుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈమధ్యనే భారీ షాపింగ్ మాల్ ఒకటి పటాన్చెరువు దగ్గరలో జరిగింది అది కూడా బాలకృష్ణ చేతుల మీదుగా జరగడం విశేషం. దీనికి సంబంధించిన యాడ్ కూడా బాలకృష్ణ చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఈ యాడ్ కి బాలయ్య బాబుకి అందిన రెమ్యూనరేషన్ అక్షరాల మూడున్నర కోట్లు.

యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని బసవతారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్ కి నందమూరి బాలకృష్ణ తరలించేందుకు నిర్ణయం తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే అలాగే అన్ స్టాపబుల్ షో ద్వారా వచ్చిన అమౌంట్ కూడా ఆయన క్యాన్సర్ హాస్పిటల్ కి డొనేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంతైనా బాలయ్య మనసు బంగారం అంటున్నారు ఆయన అభిమానులు. అంతే కదండీ కింద మీద ఊపు బాలయ్య బాబు తోపు అని ఊరికే అనరు కదా!


You may also like

Leave a Comment